ఎన్నో ఔషధగుణాలున్న కరివేపాకు చెట్టు పెరట్లో వుండటం చాలామంచిది గాలిని శుభ్రపరచే గుణం కరివేపాకు చెట్టుకు ఉంది. కాలుష్యం ఎక్కువగా ఉన్నచోట ఈ చెట్లనాటితే గాలి శుభ్రపడుతుంది. ఈ చెట్టలోని బెరడు, గింజలు, పువ్వులు అన్నింటిలోకి ఔషధగుణాలు వున్నాయి. సువాసన భరితంగా వున్న కరివేపాకులో ఐరన్ పుష్కలంగా లభిస్తుంది. రక్తహీనతతో బాధపడేవారు కరివేపాకు రోజూ తింటే ఫలితం వుంటుంది కరివేపాకు శరీరంలోని వేడిని తగ్గించి, చెమట బారినుండి రక్షిస్తుంది. దీనిని పొడి చేసుకొనే లేదా వివిధ ఆహారపదార్థాలతో కలిపి తీసుకొనవచ్చును.