మెంతి కూర ఆరోగ్యానికి మేలుచేయటంలో ముందుంటుంది. ప్రతిరోజూ మెంతికూర తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఉడకబెట్టిన మెంతిఆకులు అజీర్ణాన్ని పోగొడతాయి. మందంగా ఉన్న కాలేయాన్ని చురుకుగా పనిచేయిస్తుంది. రక్తంలో చక్కెరశాతాన్ని నియంత్రించటంలో సహాయపడుతుంది. వారంలో రెండుమూడుసార్లు ఈ ఆకుకూరను తీసుకేం ఎంతో మంచిదని చెబుతున్నారు వైద్యులు. మెంతికూరలో ఫాస్పరస్, క్యాల్షియంతో పాటు ప్రొటీన్స్ కూడా పుష్కలంగా ఉంటాయి. మెంతికూరలో ఇనుము సమృద్ధిగా ఉంటుంది. రక్తహీనత ఉన్నవారు తరచుగా మెంతికూర తీసుకోవటం వలన రక్తహీనత సమస్యను త్వరగా నివారించుకోవచ్చు. హిమోగ్లోబిన్ శఆతం పెరుగుతుంది. మధుమేహం ఉన్నవారు మెంతిరసంను ప్రతిరోజూ తీసుకోవటం వలన ఇన్సులిన్ శాతం అదుపులోకి వస్తుంది. ఈ కూరలో విటమిన్ కె ఎక్కువగా ఉంటుంది. ఇది గాయాలైనపుడు రక్తం త్వరగా గడ్డకట్టడానికి పనికొస్తుంది. మలబద్ధకం ఉన్న పిల్లలకు తరచూ ఈ కూరను తినిపించటం మంచిదని చెబుతున్నారు నిపుణులు. ఇందులో పీచు సమృద్ధిగా లభిస్తుంది. కొలస్ట్రాల్ శాతం తక్కువ. ఒక గుప్పెడు మెంతిఆకులను రొట్టెలలో, పొరాటాలలో వేసుకోవచ్చు. బరువు తగ్గాలనుకునేవారు దీన్ని తరచుగా తింటే మంచిదంటారు నిపుణులు. మెంతి కూరలో ఉండే మాంసకృత్తులు చర్మానికి ఎంతో మేలు చేస్తాయి. జుట్టు ఎదగటానికి తోడ్పడతాయి. ఆకులను ఎండబెట్టినా వాటిలో పోషకాలు ఉంటాయి.