header

Gongura

గోంగూర....

గోంగూర.....పుల్ల పుల్లగా నోరూరించే గోంగూరను ఇష్టపడని వారు తెలుగు నేలలో ఉండరు. గోంగూరను పప్పుగా, పచ్చడిగా, పులుసుకూరగా, మటన్, చికెన్ లలో కలిపినా దీని రుచి అద్భుతం. ఒకప్ఫుడు వివాహ భోజనాలలో గోంగూరు పచ్చడి తప్పనిసరిగా ఉండేది. గోంగూరలో ఎన్నో పోషక విలువలు ఉన్నాయి. విటమిన్స్, మినరల్స్ పుష్కలంగా ఉండటం వలన దీనిని తరచుగా తీసుకుంటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. గోంగూరలో పీచు పదార్ధం ఎక్కువగా ఉంటుంది.. శరీరంలో జీర్ణశక్తి పెరిగి జీర్ణసమస్యలు తగ్గుతాయి. గోంగూరలో ఉన్న మరొక విశేషం రక్తంలో ఇన్సులిన్ స్థాయి పెరిగి షుగర్ లెవల్స్ తగ్గుతాయి. కనుక గోంగూరను మధుమేహం గలవారు ఆహారంలో రోజువారీ తీసుకుంటే షుగర్ వ్యాధి నియంత్రణలో ఉంటుంది. రక్తహీనతను దూరం చేసుకోవాలంటే గోంగూరను మించినది లేదు. ఇందులో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. విటమిన్ కె కూడా పుష్కలంగా ఉంటుంది. ఇది రక్తహీనతను నివారిస్తుంది. దగ్గు, ఆయాసం, తుమ్ములతో బాధపడేవారు గోంగూరను ఏదో రూపంలో తీసుకుంటూ ఉంటే సహజ ఔషధంలాగా పనిచేస్తుంది. మంచిది కదా అని దేనిని ఒకేసారి ఎక్కువ మోతాదులో తినరాదు. కొద్ది కొద్దిగా ప్రతిరోజూ తినవచ్చు.