header

Pudina, Podina

పొదీన

పొదీన మంచి రుచిని, సువాసను కలిగి ఉంటుంది. ఉదరరోగాలను తగ్గిస్తుంది. కడుపు కండరాలను శుభ్రపరచి పిత్తాశయం నుండి వచ్చే జీర్ణరసాల ప్రభావం ఆహార పదార్ధాలలో ఉండే కొవ్వులమీద బాగా ఉండేలా చేస్తుంది.
కడుపు ఉబ్బరంను తొలగిస్తుంది. గొంతులో ఉండే ఇబ్బందులను తొలగించి కళ్లెను కరగించి దగ్గునుండి ఉపశమనం కలిగిస్తుంది. విటమిన్ ఎ పుష్కలంగా ఉంటుంది. పుదీనా టీ, పుదీనా డ్రింక్ లు బాగా వాడకంలో ఉన్నాయి. లెమన్ టీలో మంచి ఫ్లేవర్ కోసం పుదీనా ఆకులను కలుపుతారు. సహజమైన మౌత్ ఫ్రెషనర్ గా కూడా పనిచేస్తుంది. నోటి వాసనతో బాధపడేవారు కొద్దిగా పుదీనా ఆకులను తరచుగా నమలటం మించిది. పుదీనా ఆకులను పేస్టులాగా చేసి చిగుళ్లు, పళ్లు రుద్దితే వాసన సువాసనాభరితంగా ఉండి నోటి దుర్వాసన తొలగిపోతుంది.
ఇడ్లీ, దోసె, గారెలలోనికి పుదీనా చట్నీ మంచి కాంబినేషన్