header

Spinach

పాలకూర

పాలకూరలో 13 రకాల యాంటీ ఆక్సిడెంట్ ఉన్నాయి. ఇవి యాంటీ క్యాన్సర్ ఏజెంట్లుగా పనిచేస్తాయి. పాలకూరలో లభించే విటమిన్ సి.ఎలు మెగ్నీషియం, ఫోలిక్ యాసిడ్లు క్యాన్సర్లను నివారించటంలో తోడ్పడుతాయి. ఉపరితిత్తుల, రొమ్ము క్యాన్సర్లను నివారించటంలో ఇవి తోడ్పడుతాయి. గుండె జబ్బులు రాకుండా అడ్డుకుంటాయి. పాలకూరలో క్యాలియం, సోడియం, ఫాస్పరస్,ఇనుము, ఖనిజ లవణాలు, విటమిన్ ఎ, సిలు ఉంటాయి. ఇనుము పుష్కలంగా వుండే పాలకూర రక్తహీనతను తగ్గిస్తుంది. రక్తాన్ని శుద్ధి చేసి రోగనిరోధక శక్తిని పెంచుతుంది.