header

Pototos / బంగాళాదుంపలు

Pototos / బంగాళాదుంపలు
బంగాళాదుంప అనేది దుంప జాతికి చెందిన కూరగాయ. 17వ శతాబ్దం వరకూ దక్షిణ అమెరికా మినహా ప్రపంచదేశాలంతటికీ బంగాళాదుంప పరిచయం లేదు. భారతదేశానికి బ్రిటిష్‌ వారు బంగాళాదుంపను తీసుకొచ్చారు. ఆలుగడ్డ అని, ఉర్లగడ్డ అనే పేర్లతో బంగాళాదుంపను పిలుస్తూ ఉంటారు. ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తవుతున్న ఆహార పంటల్లో వరి, గోధుమ, మొక్కజొన్న తరువాత బంగాళాదుంప నాలుగో స్థానంలో ఉంది. బంగాళాదుంపలతో వంటల్లో ఎన్నో రకాల ప్రయోగాలు చేస్తూ ఉంటారు. ఫ్రై, కూరలు, చిప్స్‌ ఇందులో కొన్ని. డయాబెటిక్‌ పేషెంట్స్‌ బంగాళాదుంపను తక్కువగా తీసుకుంటే మంచిది.
పోషకాలు:
బంగాళాదుంపలో పిండి పదార్థాలు, మాంసకృత్తులు ఎక్కువ. విటమిన్‌ సి, బి6, కె లాంటి విటమిన్లు బంగాళాదుంపలో ఎక్కువగా లభిస్తున్నాయి. పొటాషియం ఇందులో ఎక్కువగా లభించే ఖనిజ లవణం. క్యాల్షియం, ఫాస్ఫరస్‌ లాంటివి కూడా తగు మోతాదుల్లో లభిస్తాయి.
ఆరోగ్య లాభం
బంగాళాదుంపలో సమృద్ధిగా లభించే విటమిన్‌ సి, పొటాషియం లాంటి పోషక పదార్థాలు రోగనిరోధక శక్తిని పెంచడంలో బాగా తోడ్పడతాయి. రక్తపోటును నియంత్రించడలో, గుండె ఆరోగ్యానికి, మెదడు పనితీరు చురుగ్గా ఉండటానికి కూడా బంగాళాదుంప ఉపయోగప డుతుంది. క్రీడాకారులు తక్షణ శక్తి కోసం బంగాళాదుంపను తమ డైట్‌లో చేర్చుకుంటూ ఉంటారు.