header

Radish

Radish….ముల్లంగి ముల్లంగి అంటే తెల్లని దుంపలు మాత్రమే కాదు. ఇవి చాలా రంగుల్లో, ఆకారాల్లో దొరకుతాయి. మనదగ్గర తెల్లనివే ఎక్కువ. వీటిలో ‘ఐసోధియోసైనెట్‌’ ఎక్కువగా ఉంటుంది. అందుకే కోయగానే ఘూటైన వాసన. ముల్లంగి వాడకం మనదగ్గర కాస్త తక్కువే. ఆకులయితే తుంచి పారేస్తాం కానీ విటమిన్‌ సి ప్రోటీన్‌, కాల్షియం శాతం వేళ్ళలో కన్నా ఆకులలోనే ఎక్కువ. దుంపల్ని కూడా పెరుగు చట్నీ లేదంటే సాంబారుకే పరిమితం చేస్తాం. ఉత్తరాదిన మాత్రం ముల్లంగి తురుమును పరాటాల్లో వాడతారు.
వీటి స్వస్థలం చైనా. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ముల్లంగి పండుతుంది. ముల్లంగిలో ల్యూటెన్‌, బీటాకెరోటిన్‌, జియాక్సాంధిన్‌ వంటి యాంటీ ఆక్సిడెంట్ల శాతం చాలా ఎక్కువ. వీటితో పాటు అత్యధికంగా ఉండే సి-విటమిన్‌, ఫోలిక్‌ ఆమ్లం, ఖనిజాలు..క్యాన్సర్లు రాకుండా ఉండేందుకు దోహదపడతాయి. పేగులు, మూత్రపిండాలు, పొట్ట క్యాన్సర్లు రాకుండా ఉండేందుకు దోహదపడతాయి.
రోగ నిరోధకశక్తిని పెంచుతాయి. ముల్లంగిలో ఉండే జింక్‌, బి కాంప్లెక్స్ విటమిన్లు ఫాస్పరస్‌ లు చర్మవ్యాధులు, పొడిచర్మ నివారణకు ఉపయోగపడతాయి.
వంద గ్రాముల ముల్లంగిలో పోషకాల శక్తి
16 కిలో క్యాలరీల పిండి పదార్థాలు : 3.4 గ్రా
ప్రొటీన్లు : 0.68 గ్రా.
పీచు : 1.6 గ్రా
నియాసిన్‌ : 0.2 మి.గ్రా
కాల్షియం : 25 మి.గ్రా
విటమిన్‌ సి : 14.8 మి.గ్రా
మెగ్నీషియం : 10 మి.గ్రా
జింక్‌ : 0.28 గ్రా
సోడియం : 39 మి.గ్రా
పొటాషియం : 233 మి.గ్రా
పొటాషియం, కాల్షియం, మాంగనీస్‌ ఎక్కువగా ఉండి సోడియం తక్కువగా ఉండటం వలన బీపి రోగులు ముల్లంగిని నిత్యం తీసుకుంటే ఫలితం ఉంటుంది. ఆస్తమా, కఫం, సైనసైటిస్‌తోపాటు ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యలతో బాధ పడేవాళ్లకి ముల్లంగి ఎంతో మంచిది. శ్వాస చక్కగా ఉంచేలా చేస్తుంది
కాలేయం పిత్తాశయ పనితీరును ముల్లంగి మెరుగుపరుస్తుంది.ఎలాంటి ఇన్ఫెక్షన్లు సోకకుండా చూస్తుంది. ఈ దుంప వేరు కామెర్ల నివారణకు అధ్భుతమైన ఔషదం. ముల్లంగి సహజమైన క్రిమి సంహారిణి. మూత్రాశయం, మూత్రనాళాలకు ఎలాంటి ఇన్ఫెక్షన్లు రాకుండా ఉండేందు దోహదపడుతుంది. మూత్రపిండాల్లో రాళ్ళున్న వాళ్ళు ముల్లంగి ఆకుల రసాన్ని తీసుకోవటం వన అవి కరిగి మూత్రం ద్వారా పోతాయి. బరువు తగ్గాలనుకునేవారికి ముల్లంగి మంచి ఆహారం. ముల్లంగిలో క్యారీలు చాలా తక్కువ. పీచు నీటిశాతం ఎక్కువ కాబట్టి మలబద్దకానికి మంచి మందు.
ముల్లంగి రసం జీర్ణవ్యవస్థ పనితీరుని మెరుగు పరుస్తుంది. అందుకే అజీర్తి, మలబద్దకం, కామెర్లు కంటి సమస్యలతో బాధపడేవాళ్ళు ముల్లంగి ముక్కల్ని మిరియాలపొడి, నిమ్మరసం, ఉప్పుతో కలిపి తీసుకుంటే బాగా పనిచేస్తుంది. కళ్లు, చెవి, ముక్కు, గొంతు సమస్యలు వేటికయినా ముల్లంగి మంచిదే.
థైరాయిడ్‌తో బాధపడే వాళ్లు ముల్లంగిని వీలైనంత తక్కువగా వాడడం మంచిది