బీరకాయ బరువు తగ్గాలనుకునేవారికి మంచి ఆహారం. రక్తంలో చక్కెరస్థాయిల్ని క్రమబద్దీకరిస్తుంది. జిర్ణవ్యవస్థకు సహకరించి మలబద్ధకానికి చికిత్సగా సహకరిస్తుంది. రోగనిరోధక వ్యవస్థను మెరుగుపరుస్తుంది. రక్తాన్ని శుద్ధిచేస్తుంది. శరీరాన్ని చల్లబరిచే గుణాలు ఎక్కువ.
మంచిబీరకాయలు :
చర్మం గట్టిగా నిగనిగలాడుతూ ఉండాలి. మచ్చలు ఉండకూడదు. వడిలిపోయినట్లున్న వాటిని కొనకూడదు. గిల్లి చూస్తే కాయలేతదనం అర్ధమవుతుంది. ముదురు కాయలు పీచుపట్టి పనికి రావు వందేముందు కొద్దిగా రుచిచూస్తే చేదు కాయలు ఉంటే తెలుస్తుంది. చేదు కాయలు తినరు. ఎయిర్ టైట్ ప్లాస్టిక్ కవర్ లలో పెట్టి ఫ్రిజ్లో ఉంచితే ఎక్కువ రోజులుంటాయి.
ఇతర ఉపయోగాలు : చక్రాల్లా తరిగి పిండిలో మంచి బజ్జీలు తయారుచేయవచ్చు. ఉల్లిపాయలు, టొమాటో ముక్కలు కలిపి గ్రేవీతో మరియు గ్రేవీ లేకుండా కూర చేసుకోవచ్చు పప్పు, సాంబారులలో ముక్కలు తరిగి వేయవచ్చు మరియు విడిగా కూరగా వండుకోవచ్చు బీరకాయ పచ్చడికి పేరు పొందినది.