header

Snake Gourd

పొట్లకాయ
పొట్లకాయలోక్యాలరీలు తక్కువగా ఉండి, నీరు పీచు అధికంగా ఉంటాయి. ప్రోటీన్లు ఫ్యాట్స్ కార్బోహైడ్రేట్ల విటమిన్ బి కాంప్లెక్స్ క్యాలియం, మెగ్నీషియం, ఫాస్పరస్, ఐరన్, బీటా కెరోటిన్ వంటి ఖనిజాలు బాగా లభిస్తాయి. 100 గ్రాముల పొట్లకాయలో 18 క్యాలరీలు మాత్రమే ఉంటాయి.
ప్రయోజనాలు దీనిలో యాంటీ ఇన్ ఫ్లమేటరీ గుణాలు అధికంగా ఉంటాయి. పాల్సిటేషన్ తో బాధపడేవారు పొట్లకాయ ఆకులనుంచి తీసిన రసం తాగితే ప్రయోజనకరంగా ఉంటుంది. రోజుకు రెండుసార్లు స్పూన్ రసం తాగాలి. దీనిలో ఉండే నీరు, ఫైబర్ వల్ల డయాబెటిస్ నియంత్రణలో ఉంటుంది. జీర్ణక్రియకు సహకరించి మలబద్ధకాన్ని తగ్గిస్తుంది. కాబట్టి జీర్ణవ్యవస్థకు మేలు చేస్తుంది. శారీరక వ్యవస్థనుండి మ్యూకస్ ను వెలికి వెట్టివేయగల గుణాలు పొట్లకాయలకు ఉన్నాయి. పొట్ల ఆకుల రసాన్ని మాడుకు మసాజ్ చేయటం వలన అలోపేషియా (బట్టతలకు దారితీసే రుగ్మత)చికిత్సలో సహకరిస్తుంది. చుండ్రును తగ్గిస్తుంది. ప్రాచీన వైద్యంలో పొట్ల ఆకులను, కొత్తిమీర నుంచి తీసిన కషాయాన్ని జ్వరాలకు వాడేవారు
మంచి పొట్లకాయలను ఎలా ఎంచుకోవాలి
నిండు ఆకుపచ్చ నుంచి తెల్లగా గట్టిగా మెత్తని చర్మంతో ఉండే కాయలను ఎంచుకోవాలి. ముడతలు పడితే కాయ ముదిరిపోయిందిని అర్థం.
ఆహారంగా
పొట్లకాయను గుజ్జుకూరగా మసాలా కూరి, ఉల్లి టొమాటోలతో వండుకోవచ్చు. సాంబారులో ముక్కలు వేసుకుంటే రుచిగా ఉంటాయి. గర్భవతులు పొట్లకాయను మితిమీరి తినకూడదు. పొట్లకాయ గింజలు ఎక్కువగా తినకూడదు. ఎక్కువగా తింటే వికారం, డయేరియా ఉదర సంబందిత అసౌకర్యం, అజీర్ణం కలుగుతాయి.