Sweet Pototos…చిలగడ దుంపలు
చిలగడ దుంపలు మంచి కూరగాయ మాత్రమే కాదు. ఆరోగ్యకరమైన అల్పాహారం కూడా. కాల్చి తిన్నా ఉడికించి తిన్నా ఎంతో రుచి. వీటిలోని తీపి ఆరోగ్యకరం అంటున్నారు పోషకాహార నిపుణలు. కూరగాయల కన్నా తీపి రుచిని కలిగి ఉండే చిలగడదుంపని నేరుగా ఉండికించుకుని లేదా కాల్చుకుని తినవచ్చు. ఇది రుచికరమైన స్నాక్ ఫుడ్‌గా ప్రాచుర్యం పొందింది. అద్భుత పోషకాల గని. మరే కూరగాయలోనూ లేనన్ని పోషకాలు ఇందులో ఉన్నాయి. విటమిన్ ఎ, సి, బి2, బి6 లాంటి వాటితో పాటు ఇతరత్రా ఖనిజాలు వీటిల్లో ఎక్కువ. యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగ్నల్ గుణాలు మెండు. క్యాన్సర్‌ను నిరోధించే యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలం
.
అందమైన పొదలా పాకే చిలగడ దుంపల్లో చాలా రకాలున్నాయి. మనదగ్గర తెలుపు, లేత పసుపు రంగు గుజ్జున్న దుంపలే ఎక్కువ. కానీ పసుపు, నారింజ, ఎరుపు, గోధుమ, వంకాయ రంగు ఇలా విభిన్న రంగుల గుజ్జు ఉన్న దుంపలు చాలానే ఉన్నాయి. అలాగే తెలుపు, లేత పసుపు రంగు గుజ్జు ఉన్న దుంపలతో పోలిస్తే మిగిలినవి ఎక్కువ తియ్యగా ఉంటాయి.
బంగాళాదుంపల మాదిరిగానే ఫ్రెంచ్ ఫ్రైస్, చిప్స్ కూడా తయారు చేయవచ్చు. మనదేశంలో కూరల్లో కలగలిపి వండటంతో బాటు బూరెలు బొబ్బట్లు వంటి వంటకాలు కూడా చేస్తారు.
వంద గ్రాముల చిలగడదుంపల్లో పోషకాల శక్తి .
86 క్యాలరీల
పిండిపదార్ధాలు17 గ్రా .
పీచు 3 గ్రా. .
ప్రొటీన్లు 1.6 గ్రా .
విటమిన్ ఎ 708 మై.గ్రా .
విటమిన్ సి 2.4 మి.గ్రా .
కాల్షియం 30 మి.గ్రా.
మాంగనీస్ 0.2 మి.గ్రా .
మెగ్నీషియం 25 మి.గ్రా.
ఫాస్పరస్ 47 మి.గ్రా .
పోటాషియం 337 మి.గ్రా .
సోడియం 55 మి.గ్రా