header

Tomotos

టమాటో – యాపిల్ కన్నా మిన్న
టమాటోలలో రక్తాన్నిశుద్ధిచేసే శక్తి ఉంది. పిత్తాశయంలో రాళ్లు ఏర్పడకుండా నివారిస్తుంది. కాలేయానికి రక్తం అధికంగా సరఫరా కాకుండా కాపాడుతుంది. క్యాల్షియం, ఫాస్పరస్, ఐరన్, పొటాషియం, ప్రొటీన్స్ రోజువారీ అవసరమయేయ విటమిన్లనూ, ఖనిజలవణాలలో అధికభాగం టమాటోలలో పొందవచ్చు.
టమాటాల్లొ ఉండే లైకోపిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ శరీరానికి హానిచేసే ఫ్రీరాడిల్స్ ను తరిమికొడుతుంది. ఇందులోని బెటాకెరోటిన్ శరీరంలోని ఏ విటమిన్ గా మారిపోతుంది. టెస్టోరెన్ ఉత్పత్తిలో ఎ విటమిన్ ది కీలకపాత్ర. ఇస్నోఫీలియా ఉంటే టమోటో రసంలో కొద్దిగా పసుపు కలిపి త్రాగితే ఉపశమనంగా ఉంటుంది.
టమాటోరసం చర్మకాంతిని మెరుగుపరచి మృదుత్వాన్ని ఇస్తుంది. ఫంగస్ కు చెక్ పెట్టే ఆక్టాలిక్ యాసిడ్ అధికంగా ఉంటుంది కాబట్టి మూత్రపిండాలలో రాళ్ళున్నవారు వీటిని తినరాదు.