header

Ullikadalu

Ullikadalu / ఉల్లికాడలు
సాధారణంగా మనకు రోజువారీ ఆహారం నుంచి లభించని కొన్ని ఖనిజాలు ఈ ఉల్లికాడల నుంచి తేలిగ్గా అందుతాయి. ముఖ్యంగా రాగి, మెగ్నీషియం, పొటాషియం, క్రోమియం, మాంగనీస్లతోపాటూ బి విటమిన్లు ఇందులో సమృద్ధిగా ఉంటాయి.
వీటిలో ఉండే అల్లీప్రొఫైల్డైసల్ఫైడ్ గుండె జబ్బులు రాకుండా నివారిస్తుంది. వీటినుంచి అందే సల్ఫర్ అధికరక్తపోటు సమస్యను అదుపులో ఉంచుతుంది.
మధుమేహం ఉన్నవారు ఉల్లికాడల్ని రోజువారీ ఆహారంలో చేర్చుకోవడం మంచిది. కారణం దీన్నుంచి అందే క్రోమియంతోపాటూ అలీప్రొపైల్డైసల్ఫైడ్ రక్తంలోని చక్కెర స్థాయుల్ని క్రమబద్ధీకరించడమే.
దగ్గు, జలుబుతో బాధపడేవారు ఉల్లికాడలతో వండిన వంటలు తింటే తక్షణ ఉపశమనం అందుతుంది. అజీర్తి సమస్యలు కూడా తగ్గుతాయి. అలాగే ఉబ్బసం, కంటి సమస్యలతో బాధపడేవారూ దీన్ని తప్పనిసరిగా తీసుకోవాలి.
తరచూ ఉల్లికాడలు తినడం వల్ల శరీరానికి అల్లిసిన్ అనే పోషకం అందుతుంది. అది వృద్ధాప్య ఛాయలు రాకుండా చర్మాన్ని కాపాడి.. ఆరోగ్యంగా ఉంచుతుంది.