
రాజస్థాన్ లోని సికార్ జిల్లలోని అజీత్ ఘడ్ కు చెందిన రైతు జగదీశ్ ప్రసాద్ హైబ్రీడ్ రకాలకంటే పెద్దవిగా ఉండే కూరగాయలను సేంద్రీయ పద్ధతులలో పండించి అద్భుతాలను సృష్టించాడు....
తన సొంత ఐదు ఎకరాల పొలంలో పాతిక కేజీల క్యాబేజీ, ఎనభై కేజీల గుమ్మడికాయలు, మూడు అడుగుల వంకాయలు, ఐదు కేజీల గుండ్రని వంకాయలు, ఏడడుగుల బీరకాయలు, ఆరడుగుల సొరకాయలు, మూడున్నర అడుగుల క్యాబేజీ, 250 గ్రాముల బరువున్న ఉల్లిపాయ ఒకే మిర్చిమొక్కకు 150 నుండి 200 వందల మిరపకాయలు పండిస్తున్నాడు. ఇవన్నీ సేంద్రీయ వ్యవసాయ పద్దతుల ద్వారా పండించినవే. వీటికి ఎటువంటి రసాయనిక ఎరువులు, మందులు వాడలేదు.
కేంద్రప్రభుత్వం జగదీష్ కృషిని గుర్తించి పద్మశ్రీ అవార్డును ఇచ్చి గౌరవించింది.
మొక్కల వరుసలలో మామూలు కంటే కొద్దిగా ఎక్కువగా(1.5 నుండి 2 అడుగులు) దూరం ఉంచి మూడు, నాలుగు రోజులకొకసారి మొక్కలకు నీరుపెడుతూ, వానపాములు, సేంద్రీయ ఎరవులను వాడుతూ ఈ అద్భుతాలను సాధిస్తున్నాడు.
25.5 కేజీల క్యాబేజీన పండించి దానికి తన సొంత ఊరుపేరైన అజిత్ ఘడ్ అని పేరు పెట్టుకున్నాడు. దీనితో లిమ్కా బుక్ లో స్థానం సంపాదించుకున్నాడు.
శాస్త్రవేత్తలు జగదీశ్ పంటలను చూసి సారవంతమైన నేల, సేంద్రీయ ఎరువులు, మంచివిత్తనాలు, తోటలో వరుసల మధ్య సరియైన దూరం ఉండటం వలనే ఇదంతా సాధ్యమైందని తెలిపారు.