తైవాన్ జామకాయ ఒక్కోటి అరకిలో, ముప్పావు కిలో బరువు తూగుతుంది. ఈ కాయలలో నీటిశాతం ఎక్కువగా ఉంటుంది. గింజలు కూడా తక్కువగా ఉండి కండభాగం ఎక్కువగా ఉంటుంది. కొద్దిపాటి ఖాళీ స్థలం ఉన్న వారు కూడా ఒకటి రెండు మొక్కలు పెంచుకోవచ్చు.
రైతులు పొలాలలో లాభసాటి పంటగా పండించుకోవచ్చు. తైవాన్ జామ మొక్కలు కావలిసిన వారు నర్సరీలలో కొనవచ్చు. లేక ఉద్యావనశాఖ వారిని సంప్రదించవచ్చు.