header

Thai Apple…థాయ్ యాపిల్

Thai Apple…థాయ్ యాపిల్
మంచి దిగుబడితో తొలి సంవత్సరం నుండే పంట చేతికి వచ్చి రైతులను లాభసాటి బాటలో నడిపిస్తుంది ధాయ్ యాపిల్. రేగుచెట్టు మొదలుని, యాపిల్ చెట్టు కాండాన్ని జత చేసి రూపొందించబడినదే థాయ్ యాపిల్ చెట్టు.
ఈ చెట్టుకు రేగు చెట్టులాగా ముళ్లండవు. చూడటానికి యాపిల్ పళ్లలాగా ఉండి రేగుపళ్ల రుచిని ఇస్తాయి. వీటిలో రేగుపళ్లలాగే ఒకే గింజ ఉంటుంది. నాటిన ఎనిమిది నెలలకు కాపువస్తుంది. ఒక్కో చెట్టునుండి 50 నుండి 80 కిలోల వరకు ఈ రేగుపండ్లు కాస్తాయి.
పెట్టుబడి ఎకరాకు 50 వేలకు మించదు. కొమ్మలను కత్తిరించినపుడు కొత్త కొమ్మలు వచ్చి కాయలు కాస్తాయి. ఈ చెట్ల ఆకులను పశువులకు మేతగా కూడా వేయవచ్చు. తక్కువ నీటితో ఈ చెట్లను పెంచుకోవచ్చు. నీటి ఎద్దడిని తట్టుకుంటుంది. అపార్ట్ మెంట్లలో, కొద్దిగా ఖాళీ స్థలం ఉన్న ఇళ్లలో కూడా ఒకటి రెండు మొక్కలను పెంచుకోవచ్చు.
ఈ చెట్లు కావలిసినవారు తెలంగాణా రాష్ట్రంలోని జడ్చర్ల లోని కృష్ణారెడ్డిని సంప్రదించవచ్చు. ఇతను స్వయంగా నర్సరీ ఏర్పాటు చేసి కావలిసిన వారికి ఈ చెట్లు సరఫరా చేస్తున్నాడు. తెలంగాణా ప్రభుత్వం ఈ పంట సాగుకు సబ్సిడీ కూడా అందచేస్తుంది.
పూర్తి వివరాలు కావలిసిన వారు మీ దగ్గరలో ఉన్న ఉద్యానవన శాఖ వారిని సంప్రదించవచ్చు.