header

Wildlife Sanctuaries in Andhra Pradesh

Gundla Brahmeswara Wildlife Sanctuary / గుండ్ల బ్రహ్మేశ్వర వన్యప్రాణి రక్షితకేంద్రం

ఈ వన్యప్రాణి రక్షితకేంద్రం కర్నూలు, ప్రకాశం జిల్లాలో 1194 చ.కి.మీ. వ్యాపించి యున్నది. నల్లమల అడవులో వున్న చాలా పురాతనమైన అటవీప్రాంతం. ఔషధ మొక్కలకు ప్రసిద్ధి చెందిన అటవీ ప్రాంతం. గుండ్లకమ్మ నది ఈ అభయారణ్యం గుండా ప్రవహిస్తుంది.
జంతువులు : ఇక్కడ వున్న ప్రధానమైన జంతువు నల్లచిరుతలు, ఎుగుబంట్లు, అడవిపందులు, అడవి పిల్లులు రకరకా జింకలు, దుప్పులు, నక్కులు, కలివికోళ్ళు.
వృక్షజాతులు : టేకు చెట్లు, రక్తచందనం, సిరిమాను, కరక్కాయ చెట్లు, దిరిసెన చెట్లు, ఇరుగుడు చెట్లు, వెదురు
ఎలా వెళ్ళాలి : కర్నూలు రైల్వే స్టేషన్‌ నుండి 100 కి.మీ నంద్యాల నుండి 30 కి.మీ.దూరంలో ఉంటుంది.
వసతి సౌకర్యం : నంద్యాల మరియు దిగువమెట్ట అటవీశాఖ అతిధిగృహాలలో ఉండవచ్చు.
అక్టోబర్‌ నుండి మే వరకు పర్యటనకు అనుకూలం.

Srilanka Malleswaea Wildlife Sanctuary / శ్రీలంక మల్లేశ్వర వన్యప్రాణి రక్షితకేంద్రం

ఈ వన్యప్రాణి రక్షితకేంద్రం కడప జిల్లాలొ 464.42 చ.కి.మీటర్లలో వ్యాపించియున్నది. అంతరించి పోతున్న కలివికోడి పక్షులకు సురక్షితమైన ఆవాసం
జంతువులు : ఇక్కడ వున్న ప్రధానమైన జంతువు నల్ల చిరుతలు, ఎలుగుబంట్లు, అడవిపందులు, రకరకా జింకలు, దుప్పులు, నక్కలు, కలివికోళ్ళు. వృక్షజాతులు : ఎర్రచందనం, ముళ్ళపొదలు, లోతైన లోయలతో నిండి ఉంటుంది.
ఎలా వెళ్ళాలి ? : కడప రైల్వే స్టేషన్‌ నుండి 60 కి.మీ.దూరంలో ఉంటుంది.
వసతి సౌకర్యం : సిద్ధవటం, కడప అటవీశాఖ అతిధిగృహాలలో ఉండవచ్చు
అక్టోబర్‌ నుండి మార్చి వరకు పర్యటనకు అనుకూలం.

Sri Penusila Narasimha Swamy Wildlife Sanctuary / శ్రీ పెనుశిల నరసింహస్వామి వన్యప్రాణి రక్షితకేంద్రం

ఈ వన్యప్రాణి రక్షితకేంద్రం నెల్లూరు జిల్లాలో 1030.85 చ.కి.మీ. వ్యాపించి యున్నది. సురక్షితమైన అటవీ ప్రాంతం లోయలతో, చిన్న చిన్న లోయలతో సంవత్సరమంతా పచ్చదనంతో నిండివుంటుంది.
జంతువులు : ఇక్కడ వున్న ప్రధానమైన జంతువు నల్ల చిరుతలు, జింకలు, ఎలుగుబంట్లు, నక్కలు, అడవి పందులు, రకరకా పక్షులు
వృక్షజాతులు : నల్లతుమ్మ, సిరిమాను చెట్లు, కానుగ, వాక్కాయ చెట్లు
ఎలా వెళ్ళాలి ? : నెల్లూరు నుండి 50 కి.మీ (రోడ్డు మార్గం).దూరంలో ఉంటుంది.
వసతి సౌకర్యం : నెల్లురు అటవీశాఖ అతిధిగృహాంలో ఉండవచ్చు.
జులై నుండి మే వరకు పర్యటనకు అనుకూలం.

Kowndinya Wildlife Sanctuary / కౌండిన్య వన్యప్రాణి రక్షితకేంద్రం

ఈ వన్యప్రాణి రక్షితకేంద్రం చిత్తూరు జిల్లాలో 357.60 చ.కి.మీ. వ్యాపించి యున్నది. భారతదేశపు ఏనుగులకు సురక్షితమైన ఆవాసం.
జంతువులు : ఇక్కడ వున్న ప్రధానమైన జంతువులు నల్ల చిరుతలు, ఎలుగుబంట్లు, అడవిపందులు, అడవి పిల్లులు రకరకాల జింకలు, దుప్పులు, నక్కలు, కలివికోళ్ళు.
వృక్షజాతులు : అత్తి చెట్లు, నల్లతుమ్మ, చిందుగ చెట్లు, ముళ్ళపొదలతో నిండి ఉంటుంది.
ఎలా వెళ్ళాలి ? : చిత్తూరు నుండి 60 కి.మీ.దూరంలో (రోడ్డు మార్గం) ఉంటుంది.
వసతి సౌకర్యం : పలమనేరు, మదనపల్లి, హీర్స్‌లిహిల్స్‌ అటవీశాఖ అతిధిగృహాలలో ఉండవచ్చు.
అక్టోబర్‌ నుండి ఏప్రియల్‌ వరకు పర్యటనకు అనుకూలం.

Kambalakonda Wildlife Sanctuary / కంబాలకొండ వన్యప్రాణి రక్షితకేంద్రం

ఈ వన్యప్రాణి రక్షితకేంద్రం విశాఖపట్నం జిల్లాలో 70.70 చ.కి.మీ.లలో వ్యాపించి యున్నది.
జంతువులు : ఇక్కడ వున్న ప్రధానమైన జంతువులు నల్ల చిరుతలు, మచ్చ జింకలు, అడవి పందులు, నక్కలు, అడవి కుక్కలు
వృక్షజాతులు : పచ్చిక మైదానాలతో, నేలబారు పొదలతో నిండి వుంటుంది.
ఎలా వెళ్ళాలి ? : విశాఖపట్నం వెలుపల నుండి 20 కి.మీ దూరంలో ఉంటుంది.
వసతి సౌకర్యం : విశాఖపట్నంలో ఉండవచ్చు.
సంవత్సరమంతా వరకు పర్యటనకు అనుకూలం.