Hysterectomy …. గర్భకోశం తొలగింపు..... హిస్టరెక్టమి
డా॥ శ్రుతిరెడ్డి, ప్రఖ్యాత గైనకాజిస్ట్
పిల్లలు పుట్టిన తరువాత ఇక గర్భాశయంతో పనేంటి? దీనితో ఎదురయ్యే సమస్యలను భరించడం ఎందుకు? తొలగించుకుంటే సరిపోతుంది కదా! మన దేహనిర్మాణం ఎలా ఉంటుంది? తన విధులను సవ్వంగా నిర్వర్తించడంలో గర్భాశయంతో సహా అన్ని అవయవాలు ఎంత ముఖ్యమో! తప్పని సరిగా తొగించాల్సిన పరిస్థితుల గురించి .....
గర్భాశయం మూత్రాశయానికి పెద్దపేగుకు మధ్య ఫ్యూబిక్ టోన్‌కు పైభాగంలో ఉంటుంది. గర్భాశయానికి మందువైపు మూత్రాశయం, వెనుక వైపు పేగులుంటాయి. ఇది సహజమైన దేహనిర్మాణం. గర్భాశయం, సర్విక్స్, వెజైనా ఒకదాని ఆధారంగా మరొకటి పనిచేస్తాయి. గర్భాశయం (యుటిరస్)ను తొగించడం అంటే సర్విక్స్‌ను కూడా తొలగించడం జరుగుతుంది. గర్భాశయం లిగమెంట్లు నరాలు, రక్తనాళాలతో అనుసంధానమై ఉంటాయి. గర్భాశయాన్ని పాక్షికంగా గాని, పూర్తిగా గానీ తొలగించినపుడు ఈ వ్యవస్థ మొత్తం అస్తవ్యస్తం అవుతుంది. ఇది స్త్రీ శరీరం నుంచి ముఖ్యమైన భాగాలను అసహజమైన పద్ధతిలో దూరం చేయడమే.
గర్భాశయం (యుటిరస్) దేహ నిర్మాణంలో చాలా కీలకమైన భాగం. దీనిని పునరుత్పత్తికి సంబంధించిన అవయవంగానే పరిగణిస్తుటారు. నిజానికి గర్భాశయం నిర్వహించే విధుల్లో గర్భధారణ అనేది ఒకటి మాత్రమే. మిగిలిన వాటిలో గుండె సంరక్షణ ముఖ్యమైనది. గర్భాశయాన్ని తొలగించని వారితో పోలిస్తే గర్భాశయం తొలగించిన వారిలో గుండెకు సంబంధించిన రుగ్మతలు తలెత్తటానికి మూడింతల అవకాశం ఎక్కువ. అలాగే గర్భాశయంతో పాటు అండాశయాన్ని కూడా తొలగించినట్లయితే వారిలో గుండె వ్యాధుల రిస్క్ ఏడింతలు పెరుగుతుంది. గర్భాశయం పునరుత్పత్తి విధులతో పాటు హార్మోన్‌ను ఉత్పత్తి చేస్తూ ఉన్న ప్రధానమైన శరీర భాగం లోపించడంతో ఎదురయ్యే పరిణామం.
శరీరంలో అంతర్భాగంగా ఉన్న పునరుత్పత్తి అవయవం మనిషి జీవించినంత కాం విధులను నిర్వర్తిస్తూనే
ఉంటుంది. కాబట్టి ఎట్టి దశలోనూ దానిని తొగించడం సరికాదు. స్త్రీ ఆరోగ్యానికి గర్భాశయం అనుబంధ అవయవాలు ప్రతిబంధకంగా మారినపుడు మాత్రమే ఈ ఆలోచన రావాలి తప్ప మరే సందర్భంలోనూ గర్భాశయాన్ని తొలగించడం అనే ఆలోచన చేయకూడదు. హిస్టరెక్టమీ అంటే గర్భశయాన్ని తొగించడం. స్త్రీ దేహంలో అండాశయాలు, జనన గ్రంథులు, జీవితకాలం పాటు హార్మోన్‌ను ఉత్పత్తి చేస్తూనే ఉంటాయి. హిస్టరెక్టమీ చేయించుకుంటున్న మహిళల్లో 75 శాతం ఊఫోరెక్టమీ (ఓవరీను తొగించే ఆపరేన్) చేయించుకోవటం సాధారణం. ఓవరీను తొలగించుకోనివారు తాము ఓవరీను తొగించుకోలేదు కాబట్టి దేహంలో ఏమీ కోల్పోలేదనీ, ఎలాంటి అనారోగ్య పరిణామాలు ఎదురుకావని అనుకుంటారు. కానీ హిస్టరెక్టమీతో పాటు ఊఫోరెక్టమీ చేయించుకోని వారిలో ఓవరీకు రక్తప్రసరణ ప్రక్రియ సరిగ్గా జరగక వాటి పనితీరు లోపిస్తుంది. ఫలితంగా ఈ పరిస్థితి ప్రీమెచ్యూర్ మెనోపాజ్‌కు దారితీస్తుంది.
హిస్టరెక్టమీతో ఎదురయ్యే సమస్యలు : హిస్టరెక్టమీ చేయటం వలన పెల్విస్ కండరాల, నరాలు బలహీనమై ఆ ప్రభావం మూత్రాశయంతో పాటు ఇతర భాగాల మీద పడుతుంది. మూత్రాన్ని నియంత్రించుకోగలిగిన శక్తి లోపించడం, దీర్ఘకాలిక మలబద్ధకం, విరోచనాన్ని అదుపుచేసుకోలేకపోవటం వంటి సమస్యలకు దారితీస్తుంది. గర్భాశయం మూత్రాశయానికి సహజసిద్ధంగా సపోర్టునిస్తుంది. యూటిరెస్‌ను తొగించడం వల్ల బ్లాడర్ అప్పటివరకు గర్భాశయం నుండి అందుకుంటూ ఉన్న సపోర్టును కోల్పొతుంది. పేగుకు సంబంధించి కూడా ఇదే పరిస్థితి ఎదురవుతుంది. అలాగే జననేంద్రియాల్లో ఇంద్రియ జ్ఞానం తగ్గడం లేదా పూర్తిగా కోల్పోవటం జరుగుతుంది. హిస్టరెక్టమీ అయిన వారిలో లైంగిక స్పందనలు తగ్గడం, పూర్తిగా లేకపోవడం, యుటిరైన్ కాట్రాక్షన్స్ వంటి పరిణామాలు గమనిస్తుంటాము. హిస్టరెక్టమీ తరువాత ఎదురయ్యే పరిణామాల దృష్ట్యా వెజైనా (యోని)ను లిగమెంట్స్‌తో కలిపి కుట్టివేయటం జరుగుతుంది. కొంతమందిలో ఈ ప్రక్రియ అనుకున్న ఫలితాలను ఇవ్వక వైజైనా ప్రోలాప్స్ (జారడం)తో ఇబ్బంది పడుతుంటారు.
హిస్టరెక్టమి ఎప్పుడు ? ప్రత్యామ్నాయాలు ?
1. యుటిరైటిస్ క్యాన్సర్ (గర్భాశయ క్యాన్సర్), ఓవరియన్ క్యాన్సర్ (అండాశయం) సర్వికల్ క్యాన్సర్ (గర్భాశయం కంఠం) వంటి పరిస్థితులో హిస్టరెక్టమీ చేయడమే పరిష్కారం. గర్భాశయం జారడం, స్థానభ్రంశం చేందడం, ఇది యూరినరీ ప్రాబ్లమ్స్‌కు దారితీయవచ్చు. పెల్విస్ మీద ఒత్తిడి కలగడం లేదా పేగుల కదలికను నియంత్రిచడం వంటి సందర్భాల్లో గర్భాశయాన్ని తొలగించే నిర్ణయాన్ని తీసుకోవాల్సి ఉంటుంది.
2. అధిక రక్తస్రావం, వైట్ డిశ్చార్జ్ వంటి సమస్యలకు ఎండోమ్కెటియల్ అబ్లేషన్, మిరెనా ఇన్‌సెర్షన్ వంటి ప్రక్రియను అనుసరించడం ద్వారా హిస్టరెక్టమీని నివారించవచ్చు
3. ఫైబ్రాయిడ్లు ఏర్పడినపుడు వాటిని తొలగించడం కంటే గర్భాశయాన్ని తొలగించడమే మంచిదని భావిస్తుంటారు, కానీ చాలా రకాల ఫైబ్రాయిడ్లకు చికిత్స అవసరం లేదు. చికిత్స అవసరమైతే మయోమెక్టమీ చేయించుకోవచ్చు. కొన్ని రకాల ఫైబ్రాయిడ్లు క్యాన్సర్‌కు దారితీసే అవకాశం ఉన్నప్పటికీ అది 0.1 శాతం మాత్రమేనని గమనించాలి.
ఆందోళన కలిగించే అంశాలు : వైట్ డిశ్చార్జ్, అధిక రక్తస్రావం, ఫైబ్రాయిడ్లు... మహిళను ఆందోళనకు గురిచేస్తుంటాయి. నిజానికి వైట్ డిశ్చార్జ్ అనగానే అది క్యాన్సర్‌కు దారితీస్తుందేమో అని ఆందోళన చెంది హిస్టరెక్టమీ చేయించుకోవడాన్ని చూస్తుంటాము. దీనిని మందులతో తగ్గించుకోవచ్చు. అయితే చాలా సందర్భాల్లో భార్య భర్తలిద్దరూ మందులను వాడాల్సి ఉంటుంది. అలా కాకుండా స్త్రీలే మాత్రమే మందులు వాడడంతో అప్పటికి తగ్గినట్లు అనిపించినా తిరిగి సమస్య తలెత్తే అవకాశాలు ఎక్కువ. వైట్ డిశ్చార్స్‌కు ఇలా నాలుగైదు సార్లు యాంటీబయోటిక్స్ వాడిన వాళ్ళు విసిగిపోయి హిస్టరెక్టమీ చేయుంచుకోవటానికి మొగ్గు చూపుతుంటారు.
అనారోగ్య పరిస్థితులు
హిస్టరెక్టమీ ఎడ్యుకేషన్ రీసోర్సెస్ అండ్ సర్వీసెస్ ఫౌండేషన్ 1991 నిర్వహించన అధ్యయనంలో హిస్టరెక్టమీ చేయుంచుకున్న వారిలో కనిపించే లక్షణాలు... జీవకళ లోపించడం, కీళ్ల నొప్పులు, తీవ్రమైన నీరసం,దేహాకృతితో మార్పు, లైంగిక వాంఛ లోపించడం, శక్తి తగ్గినట్లు అనిపించడం, షార్ట్ టరమ్ మెమరీ, , ఎముకలు, కీళ్లనొప్పులు, నిద్రలేమి, ఆత్మస్థైర్యం లోపించడం, ఆత్మహత్య చేసుకోవాలన్న ఆలోచన రావడం, ముందు చేస్తున్న పనులను అదే స్థాయలో చేయలేకపోవటం, మాతృత్వ భావనలు లోపించడం వంటి సమస్యలు ఎదురవుతున్నట్లు తెలిసింది ఇవన్నీ హిస్టరెక్టమీ చేయించుకున్న తర్వాత పదినుంచి ఇరవై ఏళ్ళలో సంభవిస్తున్నట్లు సమాచారం.