header

Sex in Pregnency Period….గర్భధారణ సమయంలో కలయుక.....

Sex in Pregnency Period….గర్భధారణ సమయంలో కలయుక.....
డాక్టర్ ప్రణీతీ రెడ్డి, యూరో గైనకాలజిస్ట్...సౌజన్యంతో..
కాబోయే తల్లి తండ్రులలో చాలా మంది తీసుకునే మొదటి జాగ్రత్త కలయుకను పూర్తిగా వాయిదా వేయడం. పైగా ఈ సమయంలో లైంగికచర్య వల్ల కాబోయే బిడ్డకు ఏదయినా సమస్య ఎదురుకావచ్చు అని భయపడతారు. అందుకే సురక్షితం కాదని దూరంగానే ఉండిపోతారు. కానీ అందరికీ ఇది వర్తించదు. దీనివల్ల బిడ్డకు ఎలాంటి ప్రమాదం ఎదురుకాదు కూడా ఎందుకంటే పాపాయి గర్భసంచిలో ఉమ్మనిటి మధ్య ఉంటుంది. పైగా మ్యూకస్ గర్భాశయ ముఖద్వారాన్ని కప్పి ఉంచుతుంది. గర్భాశయ కండరాలు కూడా ధృఢంగానే ఉంటాయి. అలా బిడ్డకు ఏ ప్రమాదం జరగదు. కలయిక వల్ల కొన్నిసార్లు ఇన్ ఫెక్షన్లు ఎదురైనా అవి పుట్టబోయే పాపాయి వరకూ చేరవు. కాబట్టి భయపడక్కర్లేడు. అయితే కొన్ని సందర్భాల్లో మాత్రం వైద్యలు కొందరు మహిళలకు హైరిస్క్ ప్రెగ్నెన్సీ అని నిర్ధారిస్తారు. అలాంటప్పుడూ, మరికొన్ని సందర్భాలలో లైంగిక చర్యకు దూరంగా ఉంటేనే మంచిది. అదెప్పుడంటే
- నెలలు నిండకుండానే కాన్పు అయ్యే అవకాశాలు ఉన్నపుడు...
- గతంలో అబార్షన్లు అయి, మళ్లీ జరిగే పరిస్థితులు ఉన్నా.....
-స్కానింగ్ లో ఉమ్మనిటీ సంచి పగిలిపోవచ్చనే సందేహం కలిగినా, ఆ అవకాశాలు ఎక్కువగా ఉన్నా...
-అకారణంగా రక్తస్రావం అవుతున్నా లేదా మరేదయినా స్రావాలు అవుతున్నా..
- భాగస్వామికి లైంగికంగా సంక్రమించే వ్యాధులు ఉన్నా...
- గర్భాశయ ముఖద్వారం బలహీనంగా ఉదని వైద్యులు చెప్పినా, మాయ కిందకు ఉన్నా....
- కవలలు పుట్టే అవకాశం ఉన్నా.. వైద్యులు కలయుకకు దూరంగా ఉండండి అని చెప్పినపుడు మాత్రమే మానేయాలి.
అప్పుడు నిర్లక్ష్యం వద్దు...
పై కారణాలలో తప్ప ఏ ఇబ్బంది లేదని వైద్యులు చెప్పినపుడు దాదాపు తొమ్మిది నెలలవరకు కలయుకను ఆనందించవచ్చు. అయితే ఆ సమయంలో నొప్పిగా అనిపించినా ఏ మాత్రం అసౌకర్యంగా ఉన్నా వెంటనే ఆపేయాలి. చివరి నెలలో మాత్రం పూర్తిగా మానేయడమే మంచిది. ఎందుకంటే...వీర్యకణాలలో ఉండే ప్రొస్టాగ్లాండెన్స్ అనే హార్మోనల్ నొప్పులకు దారితీయెచ్చని చెబుతారు. అయితే ఈ సమయంలో వీలైనంతవరకూ కండోమ్ లు వాడటమే మంచిది. ఎంత గర్భం దాల్చినా హెచ్. ఐ.వి.హెర్పిస్, క్లమీడియా తరహా లైంగికంగా సంక్రమించే ఇన్ ఫెక్షన్లను గర్భం అడ్డుకోలేదని గుర్తుంచుకోవాలి. అసలు ఏయే దశల్లో కాబోయే తల్లిలో ఎలాంటి మార్పు జరుగుతాయంటే
మొదటి త్రైమాసికంలో... హార్మోన్ల పనితీరులో మార్పులు సహజం. శారీరకంగానూ మార్పులు ఉంటాయి. ఈ సమయంలో లైంగిక కోరికలు ఉన్నా వికారం, అలసట, వక్షోజాలు సున్నితంగా ఉండటం, తరచూ బాత్ రూంకు వెళ్లాల్సి రావడం వల్ల...కాస్త అసౌకర్యంగా అనిపించి కలయికను పూర్తి స్థాయిలో ఆస్వాదించలేక పోవచ్చు.
రెండో త్రైమాసికంలో...పొట్ట కాస్త పెరుగుతున్నా కూడా ఈ సమయంలో లైంగిక చర్య సౌకర్యంగానే అనిపిస్తుంది, గర్భం దాల్చినప్పుడు రక్తప్రసరణ కాస్త వేగంగానే ఉంటుంది. పైగా ఆ ప్రసరణ పొట్ట అడుగుభాగంలోనే ఎక్కువగా ఉంటుంది. దాంతో కలయుకను పూర్తి స్థాయిలో ఆనందించొచ్చు.
మూడో త్రైమాసికంలో...నెలలు గడిచేకొద్దీ లైంగికచర్యపై ఆసక్తి తగ్గడం సహజమే. పొట్ట పెరిగేకొద్దీ అసౌకర్యంగా అనిపించడమే దానికి కారణం అయితే ఏమాత్రం అసౌకర్యంగా ఉన్నా భాగస్వామికి చెప్పాలి. ఒకవేళ ఆ సమయంలో లేదా తరువాత రక్తస్రావం కనిపిస్తున్నా, ఉమ్మనీరు పోతోందనే సందేహం కలిగినా, నొప్పిగా అనిపిస్తున్నా వైద్యల్ని సంప్రదించడం మంచిది. రక్తస్రావం చాలా కొద్దిగా కనిపించడం సహజమే కానీ మరీ అయితే మాత్రం నిర్లక్ష్యం చేయకూడదు. భాగస్వామిలో లైంగికంగా సంక్రమించే వ్యాధులు ఉంటే కనుక అవి ఇన్ ఫెక్షన్లకు దారి తీస్తాయని గుర్తుంచుకోవాలి.
ప్రసవం తరువాత ఎప్పుడంటే...
మొదటి ఆరువారాల వరకూ వద్దని చెబుతారు వైద్యులు. ఇనఫెక్షన్ల ప్రభావం ఎదురుకాకుండే ఉండేందుకూ, ప్రసవం నుంచి కోలుకునేందుకు, గర్భధారణ సమయంలో జరిగిన హార్మోన్ల మార్పులు మళ్లీ సమతూకంలోకి వచ్చేందుకు ఆ మాత్రం సమయం పడుతుంది. పైగా ప్రసవ సమయంలో తెరుచుకున్న గర్భాశయ ముఖద్యారం మూసుకోవాడానికీ, రక్తస్రావం పూర్తిస్థాయిలో ఆగిపోవటానికి సమయం పడుతుందని అర్ధం చేకోవాలి. దానికి తోడు పాపాయి సంరక్షణతో శారీరక, మానసిక అలసటా కాస్త ఎక్కువే ఉంటుంది కాబట్టి కనీసం ఆరువారాల ఎడం పాటించాలి. అయితే ఆరువారాల కలయిక సమయంలో నొప్పిగా ఉన్నా తేలికగా తీసుకోకూడదు. రక్తహీనత, థైరాయిడ్ పనితీరులో లోపాలు కారణం కావచ్చు. అలాగే బ్యాక్టీరియల్ వెజైనోసిస్, పాలివ్వటం వలన ఈస్ర్టోజెన్ స్థాయిలు తగ్గడం, గర్భనిరోధక సాధనాలు వాడటం వల్ల ఆ చర్య నొప్పిగా అనిపించొచ్చు.
పాలిచ్చే తల్లుల్లో ఈ సమస్య ఇంకాస్త ఎక్కువగానే ఉంటుంది. కొన్నిసార్లు ఏ కారణం లేకుండానే ఆసక్తి తగ్గవచ్చు. నొప్పిగా అనిపించవచ్చు. అవన్నీ తాత్కాలికమే కాబట్టి వీలైనంతవరకూ భాగస్వామితో ఎక్కువగా గడిపేలా చూసుకోవాలి. పాలిచ్చేసమయంలో జననేంద్రియాలు పొడిబారటం సహజం. అలాంటప్పుడు లైంగికచర్య నొప్పిగా అనిపించవచ్చు. అప్పుడు మాత్రం వైద్యులు లూబ్రికెంట్స్ ను సూచిస్తారు.. మరోపని చేయవచ్చు. ఆ సమయంలో నొప్పి తగ్గడానికీ ముందే బాత్రూంకి వెళ్లటం, వేడినీటితో స్నానం చేయడం వల్ల కాస్త మార్పు ఉంటుంది. ప్రసవానంతరం జననేంద్రియాల్లోని కండకాల ధృఢత్వం మారేందుకు కిగోల్ వ్యాయామాలు చేయాలి. బాత్రూంని ఆపుతున్నట్లుగా కటివలయ కండరాలను పట్టి ఉంచి వదలాలి. ఇలా పదిసార్లు చేస్తే చాలు. -