header

Vakrasanam

వక్రాసనం
ఈ ఆసనంలో శరీరం వక్రంగా ఉంటుంది కనుక ఈ పేరుతో పిలుస్తారు. రెండు కాళ్ళు ముందుకు చాచి కూర్చోవాలి. కుడి అరికాలు ఎత్తి ఎడమ మోకాలు దగ్గర ఉంచాలి. కుడి అరచేతిని కుడివైపు నేలపై ఉంచాలి. కుడి చేతివేళ్ళు వెనుకవైపునకు ఉంచాలి. ఎడమ చేతిని కుడి మోకాలు పైగా తీసి కుడిపాదం వేళ్ళుపట్టకోవాలి. అలా సాధ్యం కాకపోతే కి మోకాలును పట్టుకోవాలి. శ్వాస వదులుతూ కుడివైపునకు నడుం,భుజం మళ్ళిస్తూ కుడి పక్కకు తిరిగి వెనకకు చూడాలి. వీపు అంతా పక్కకు తిరగాలి. శ్వాసపీలుస్తూ యధాస్తితికి రావాలి. 5-6 సార్లు ఇలా చేసిన తరువాత కాళ్ళు చేతులు మార్చి ఎడమ వైపునకు అలాగే చేయాలి.
ప్రయోజనాలు
వెన్నుముక, వీపు, మెడనొప్పులు తగ్గుతాయి. పొట్టలోని అవయవాలకుశక్తి లభిస్తుంది. మధుమేహం (డయాబెటిస్) జబ్బుపై బాగా పనిచేస్తుంది.