header

Jadavu Jewellery..జడావ్ జ్యూయలరి...

jadav jewellery Jadavu Jewellery..జడావ్ జ్యూయలరి...
జడావ్ ఆభరణాలు మొగలాయిల కాలానికి చెందినవి. ఈ ఆభరణాలు వధువులకు ప్రత్యేకం. గుజరాత్, రాజస్థాన్ లకు చెందిన ఈ ఆభరణాలను తయారు చేయాలంటే ఎంతో నైపుణ్యం అవసరం. అత్యత్తమ పనితనం వీటి ప్రత్యేకం. స్వచ్ఛమైన బంగారంతో ఈ ఆభరణాలు తయారు చేయబడతాయి. బంగారాన్ని సుతిమొత్తంగా తయారు చేసి దానికి ఖరీదైన రాళ్లను ఎటువంటి పదార్థాలు వాడకుండా అమర్చుతారు. అత్యంత జాగ్రత్తగా సునిసితమైన పనితనంతో ఈ ఆభరణాలను రూపొందిస్తారు. రాజస్థాన్ లోని బికనీర్ ఈ ఆభరణాల తయారీకి పేరు పొందింది. ఇక్కడ 15000 మంది జుడావ్ ఆభరణాలు తయారు చేసేవారున్నారు.
జడావ్ చోకర్ నెక్లెస్ లు ట్రెండీగా ఉంటాయి. వధువులకు ధరించిన సంప్రదాయ దుస్తులకు సరియైన జోడి జుడావ్ ఆభరణాలు.