header

Raja Ram Mohan Roy….రాజా రామమ్మోహన రాయ్

Raja Ram Mohan Roy….రాజా రామమ్మోహన రాయ్
ఆదునిక భారతదేశ సంఘ సంస్కర్తలలో ఆగ్రగణ్యడు. భారతీయ సాంఘిక పునరజ్జీవ ఉద్యమ పితామహుడు. సతీసహగమన నిషేధానికై, వితంతు వివాహాలు జరిపించుటకు, స్త్రీవిద్యకై, ఆధునిక విద్యావ్యాప్తికై తన జీవితాన్ని త్యాగం చేసిన మహనీయుడు. బ్రహ్మసమాజ స్థాపకుడు. నాటి సమాజంలో పాతుకుపోయి ఉన్న దురాచారాల నిర్మూలనకై శక్తివంచ లేకుండా కృషి చేసారు. ఆకాలపు సమాజంలో బహుభార్యాత్వం సహజంగా ఉండేది. వీరి బహుభార్యత్వం తప్పని ప్రజలకు ప్రజలకు నచ్చచెప్పాడు. విగ్రహారాధనను ఖండించి, అఖంఢానందంకోసం ఆద్యాత్మిక మార్గం, భగవంతుని నిరంతర ఆరాధన మంచి మార్గాలని తెలిపారు.
వీరికి పర్షియన్, అరబిక్, సంస్కృత భాషలు వచ్చు. ఖురాన్, వేదాలు, ఉపనిషత్తులను చదివారు వీరు 1774 మే 22వ తేదీన బెంగాల్ లో జన్మించారు.
వీరు 1833 సెప్టెంబర్ 23వ తేదీన బ్రిటన్ కు మొగల్ సామ్రాజ్య ప్రతినిధిగా వెళ్లారు. పర్వటనలో ఉండగానే బ్రిస్టల్ నగరంలో మొదడువాపు మరణించారు. బ్రిస్టల్ ఓ నగరానికి రాజా రామ్మోహన్ వే అని పేరుంది.