header

Fats, Lipids…LDL Cholestral, HDL Cholestral, కొలస్ట్రాల్‌ (లిపిడ్స్‌) కొవ్వు ఎంత ఉండాలి?

Fats, Lipids…LDL Cholestral, HDL Cholestral, కొలస్ట్రాల్‌ (లిపిడ్స్‌) కొవ్వు ఎంత ఉండాలి?

డా॥ ఇవటూరి రామకృష్ణ.
పిల్లలలో, పెద్దలలో అందరిలో సామాన్యంగా కొలెస్ట్రాల్‌ పెరిగిందంటారు. దీన్నే మరో రకంగా లిపిడ్స్‌ అంటారు. వైద్యపరంగా ఈ లిపిడ్స్‌ శరీరంలో తయారయ్యే ముఖ్యమైన పోషక ద్రవ్యాలు. అలాగే మన శరీరంలోని ప్రతి వ్యవస్థలోనూ రకరకా బాధలని కలుగ చేసే కనిపించని నేరస్థుల లాంటివి కూడా. ఇది ఇంటి దొంగలా, మన జీవనాన్ని జీవకణాలు ఒంటపట్టించుకునే స్థితిని అస్థిరపరుస్తాయి. వాటినే మెటబాలిక్‌ డిజార్డర్‌ అంటారు.
మన ఆహారంలోనూ, మన శరీరంలోను అనేక ధాతుసంచయాలు ఉంటాయి. ఉదాహరణకి మనం తినే గోంగూరలో ఇనుప ధాతువు ఉంది. అలాగే మన రక్తంలో, ఎర్ర కణాలలోనూ ఉంది. ఈ ధాతు పుంజాలను లిపిడ్స్‌ అంటారు. అవి కొవ్వు పదార్థాల న్యూట్రల్‌ ఫ్యాట్స్‌ కావచ్చు. వీటిని ట్రైగ్లిజరైడ్స్‌ అని కూడా అంటారు. లేదా ఫాస్పోలిపిడ్స్‌ కావచ్చు. లేదా కొలెస్ట్రాల్‌ కావచ్చు. ఇందులో ట్రైగ్లిజరైడ్స్‌ ఒక రకంగా శరీరానికి శక్తినిచ్చే ధాతుపుంజాలు. మనం తినే ఆహారంలోని కొవ్వుపదార్థాలు జీర్ణావస్థ దాటాక చిన్నప్రేవులలో ఫ్యాటీయాసిడ్స్‌ రూపంలో రక్తంలోకి గ్రహించబడతాయి. మనం అన్నం తిన్న గంటకి మనం తిన్న కొవ్వుపదార్థాలు ఈ పరిణామం చెందటం వల్ల మన రక్తం చిక్కపడుతుంది. మరో గంట తర్వాత మామూలు స్థితికి వస్తుంది. దీనికి కారణం జీర్ణమైన ఈ లిపిడ్స్‌ సూక్ష్మరూపంలో రక్తంలో పరిణామం చెందటం. కొలస్ట్రాల్‌ 200కు తక్కువగా ఉండాలి
రక్తంలోకి చేరిన ఈ కొవ్వుపదార్థాల సూక్ష్మపదార్థాలు చిన్న చిన్న రక్తవాహికలలోని సున్నితమైన లోపలి పొరల్లోను లివరులోను చేరి అక్కడ నుంచి మిగతా శరీరభాగాలకి ప్రయాణించి శక్తిని కలుగచేయాలి. కాని కొన్నిసార్లు ఇవి అక్కడే ఉండిపోవటం కూడా జరుగుతుంది. ఇది మనకి వ్యాధి కారణం కావచ్చు. రక్తంలో ఈ కొవ్వు ధాతుపదార్థం చాలా కొద్దిగానే ఉన్నా ప్రతి మూడు నిమిషాలకి తిరిగి చేరుతూ ఉంటుంది. మిగతా ఏవి లేకపోయినా ఈ ఫ్యాటీ యాసిడ్స్‌ మన శరీరానికి కావలిసిన శక్తినిస్తాయి. ఇవి చక్కగా రక్తప్రసారంలో కదలుతూ రక్తవాహికలలోనూ, లివర్‌లోనూ ఉండిపోక మిగతా శరీరభాగాలకి వెళ్ళి ఉపయోగపడాలి. అలా జరగని స్థితి మనకి హానిని కలుగచేస్తుంది. అందుకే మన రక్తంలో ఈ కొలస్ట్రాల్‌ ఎపుడూ సరైన స్థితిలో ఉంచుకునేలా మనం జాగ్రత్తపడాలి. మొత్తం కొలస్ట్రాల్‌ 200కి తక్కువగా ఉండాలి. ఆడవారిలో 50కి తక్కువ, మగ్నవాళ్ళలో 40కి తక్కువగా ఉండాలి.
మన రక్తంలో 100-130 మధ్యలో ఉంచుకోవటం మంచిది. ట్రైగ్లిజరైడ్స్‌ ఎప్పుడూ 150కి తక్కువగా ఉండేలా చూసుకోవాలి, మన శరీరంలో కొవ్వు పదార్థాలు ముఖ్యంగా రక్తవాహికలలోనూ, లివర్‌లోనూ నిలవచేయబడుతుంది.
ముఖ్యంగా లివర్‌లో ట్రైగ్లిజరైడ్స్‌ ఎక్కువగా ఉండి మన ఉపవాసం ఉన్నప్పుడు పెరిగి శరీరానికి శక్తిని సమకూర్చడానికి సహాయపడతాయి. ఇవి ఎక్కువై నిలవ ఉంటే చెడుచేస్తాయి. అందుకే మనం ముఖ్యంగా కాస్త ఒళ్ళు వస్తున్న వాళ్ళు, లావుగా ఉండేవాళ్ళు రక్తపరీక్ష తరచూ చేయించుకుంటూ లిపిడ్స్‌ స్థితిని చూసుకుంటూ వుండాలి. ఆహారంలో కొవ్వు పదార్థం ఎక్కువగా ఉండేవి తరచూ తింటుంటే ఈ లిపిడ్స్‌ పెరిగి రక్తకణాలో పలుచోట్ల పేరుకుపోయి హైపర్‌ కొలెస్టరాల్‌ అనే స్థితి వచ్చి వ్యాధికి కారణం అవుతుంది. ముఖ్యంగా గుండెని బాధపెడుతుంది. సరైన స్థితిలో వున్న ఈ కొలెస్టరాల్‌ లివర్‌లో చేరి మిగతా వాటిలో కలిసి జీర్ణశక్తిని పెంపొందించి, ధాతుపరిణామానికి సహాయపడుతుంది.
జాగ్రత్తలు : ఈ కొస్టరాల్‌ మన శరీరంలో ఎక్కువగా చేరితే గుండెని, ఊపిరితిత్తులను, రక్తాన్ని ప్రభావితం చేసి కొన్నిసార్లు తిప్పుకోలేని బాధని కలుగ చేస్తుంది. మనం చూసుకోకపోతే ఈ పరిణామం మనకి తెలియకుండానే జరుగుతుంది. ఈ తీవ్రతను గుర్తించి అమెరికాలో ‘‘నేషనల్‌ హార్ట్ లంగ్స్‌ బ్లడ్‌ ఇన్‌స్టిట్యూట్‌’’ వివిధ పరిశోధలను , తీసుకోవలసిన జాగ్రత్తలు చేసి ప్రజలకు సూచిస్తున్నది. కొలస్టరాల్‌ మనలో పెరుగుతున్నదని గుర్తించాక డాక్టరుని సంప్రదించి గుండెజబ్బు సూచనలను కాని, రక్తవాహికలో మార్పులు, జబ్బులు కాని ఉన్నాయేమో చూసుకోవాలి. ఈ స్థితివల్ల 55 ఏళ్ళు దాటాక గుండెజబ్బు వచ్చినట్లుంటే మరీ జాగ్రత్త పడాలి. పొగతాగటం, బి.పి తగ్గకుండా వుండటం, మధ్య వయస్సులో ముఖ్యంగా మగవారిలో 40 దాటాక, ఆడవారిలో 50 దాటాక ఒళ్ళు వస్తున్నట్లు అనిపించినా, ఆయాసం వస్తున్నా జాగ్రత్తపడటం అవసరం.
ముఖ్యంగా కరిగే పీచుపదార్థం వున్న బార్లీ, యాపిల్‌, క్యారెట్‌, చిక్కుళ్ళు, నారింజ, బత్తాయి వంటివి ఆహారంలో తీసుకుని, వేపుడు కూరలు, పెరుగు, స్వీట్లు, అధికంగా మాంసాహారం తగ్గించాలి. నడక మేలుచేస్తుంది. నడవండి.
లిపిడ్స్‌ సరియైన స్థితిలో ఉండటానికి కొన్ని ఆయుర్వేద చిట్కాలు : ఎండుచేపలు, ఆకుకూరలు, కమ్మని మజ్జిగ, రాగిచెంబులో నిల్వ ఉంచిన నీళ్ళు కొలెస్టరాల్‌ను తగ్గిస్తాయి. రోజూ గుడ్డు తింటే కొలెస్టరాల్‌ పెరుగుతుంది. పిల్లల విషయంలో జాగ్రత్తగా ఉండాలి.