header

Hair Problems….

Hair Problems….

శిరోజాల సమస్యలకు ఆధునిక చికిత్స ....బి.ఎన్‌.రత్న, కాస్మటాజిలస్ట్‌, అనన్య కేర్‌ క్లినిక్‌, హిమయత్‌నగర్‌ మరియు కూకట్‌పల్లి ఫోన్స్‌ : 9030313535, 9030313836
సాధారణంగా తలపై జుత్తు రాలిపోవడానికి పోషక ఖనిజలోపాలు, ఫంగల్‌ ఇన్ఫెక్షన్లు, గర్భధారణ, మానసిక ఒత్తిడి , దీర్ఘకాలిక అనారోగ్యం, మందులు వికటించడం వంటివి కారణాలు అని చెప్పవచ్చు. అయితే జుత్తు ఆగకుండా బాగా రాలిపోతుంటే మాత్రం జన్యుపరమైన కారణాలు. హార్మోన్‌లో లోపాలు ఆటోఇమ్యూనల్‌ డిజార్డర్లు వంటివి కారణాలుగా పరిగణించాల్సివుంటుంది. ఈ సమస్యను పరిష్కరించే మార్గాలను వివరిస్తున్నారు. కాస్మోటాజిస్ట్‌. బి.ఎన్‌. రత్న.
మనిషి తలపై సుమారు లక్ష నుంచి లక్షన్నర జుత్తు కుదుళ్ళు ఉంటాయి. వీటిలో రోజు సుమారు 50 నుంచి 100 వరకు జుత్తు కొసలు తెగి రాలిపోతుంటాయి. ఎటువంటి సమస్యలు లేకుంటే వెంటనే అక్కడ తిరిగి కొత్త జుత్తు మొలకెత్తుతుంటుంది. ఏదైనా లోపాలుంటే మాత్రం ఆప్రాంతంలో జుత్తు రాలడం తగ్గిపోయి జుత్తు పలచబడిపోతుంది. ఒక దశలో అది బట్టతలగా పరిణమిస్తుంది.
వ్యాధి నిర్ధారణ
ముందుగా జుత్తు రాలిపోవడానికి సమస్య ఏమిటో తెలుసుకోవాలి. పౌష్టిక ఖనిజ లోపాలు , ఫంగల్‌ ఇన్ఫ్‌క్షన్ లు, గర్భధారణ, మానసిక ఒత్తిడి, దీర్ఘకాలిక అనారోగ్యం వంటి కారణాల వలన జుత్తు రాలిపోతుంటే అంతగా ఆందోళన చెందాల్సిన పనిలేదు. చాలా తక్కువ వ్యవధిలో చిన్న చిన్న చికిత్సల వలన సమస్యల పరిష్కరించవచ్చు. అదే జన్యుపరమైన కారణాలు హార్మోనులో లోపాలు ఆటోఇమ్యూనల్‌ డిజార్డర్లు వంటి తీవ్రమైన కారణావల్ల జుత్తు రాలిపోతుంటే మాత్రం మందులు తీసుకోవడం, చికిత్స చేయడం, థెరపీ వంటివి 6 నెలల పాటు తీసుకోవాల్సివుంటుంది. ప్రధానంగా ఇవే ప్రధాన సమస్యని చెప్పుకోవచ్చు.
ఆండ్రోజెనిక్‌ అలోపిషియా :
నిజానికి ఇది జుత్తుకు సంబంధించిన సమస్యకాదు. స్త్రీ , పురుషులో జన్యుపరంగా సంక్రమించే కొన్ని ఎంజైమ్‌ లు టెస్టోస్టెరాన్‌ అనే హార్మోనును డై హైడ్రో టెస్టోస్టెరాన్‌గా మారుస్తాయి. ఈ హార్మోను జుత్తు కుదుళ్ళను శుష్కింపచేస్తుంది. దీనితో క్రమంగా జుత్తు పలచబడిపోతుంది. ఒక దశలో కుదుళ్ళు పూర్తిగా మూసుకుపోయి జుత్తు ఎదుగుదల ఆగిపోతుంది. ఈ పరిస్ధితి 18 నుండి 35 సం॥ వయస్సు వారిలో ఎక్కువగా కనబడుతుంది. పురుషులో జుత్తు ఎక్కువగా రాలిపోవడానికి కారణాలున్నప్పటికి హార్మోను, జన్యుపరమైన లోపాలే ప్రధానమైనది. కుదుళ్లు పూర్తిగా మూసుకుపోయి, జుత్తు ఎదుగుదల కానప్పటికి కొన్నేళ్ల వరకు కుదుళ్లలో జీవం అలాగే వుంటుంది. కొన్ని చికిత్సల ద్వారా తిరిగి జుత్తును మొలిపించడం సాధ్యమవుతుంది.
చికిత్స :
సమస్యను ప్రారంభదశలోనే గుర్తిస్తే చికిత్స కూడా సులభమవుతుంది. టెస్టోస్టెరాన్‌ను డి.హెచ్‌.టి గా మార్చే ఎంజైమ్‌ను గుర్తించి దానికి మందుల ద్వారా చికిత్స అందచేయాలి.
డి.హెచ్‌. టి కారణంగా
శుష్కించుకుపోయిన కుదుళ్లకు రక్తప్రసరణ అందచేయడానికి బయటనుంచి ధెరపీ చేయడం, ఆయిట్‌మెంటులు లోషన్లు వంటివి పూయవలసివుంటుంది. ఆండ్రోజెన్‌ అలోపేషియాకు అధునాతన నాన్‌ సర్జికల్‌ విధానాలు అందుబాటులో వున్నాయి. సహజ సిద్ధంగా జుత్తు తిరిగి వచ్చేలా చూడడం మూలకణా చికిత్స మెసోథెరపీ లేదా ప్లేట్‌లెట్‌రిచ్‌ ప్లాస్మాను ఇంజక్షన్‌ ద్వారా ఇవ్వడం వంటి చికిత్సా విధానాలతో ఈ సమస్యను సులభంగా పరిష్కరించవచ్చు.
మూలకణాల థెరపీ :
మన శరీరంలో రక్తకణాలు నాడీకణాలు తదితర కణాలను వేరుచేసి చూపించగల సామర్ధ్యం మూలకణాకు మాత్రమే వుంటుంది. శరీరంలోని అంతర్గత మరమ్మత్తు వ్యవస్ధగా కూడా మూలకణాలు పనిచేస్తాయి. ఈ మూలకణా ద్వారా చికిత్స చేయడం జరుగుతుంది. మొదటి దశలో తలపై చర్మం శక్తివంతంగా తయారుచేయడం జరుగుతుంది. 2వ దశలో తలపైన చర్మం నుంచి మూలకణాలను సూక్ష సిరంజీ ద్వారా ఇంజెక్ట్‌ చేయడం జరుగుతుంది. ఇది చాలా సత్ఫలితాలిస్తున్న చికిత్స విధానం డి.హెచ్‌. టి. కారణంగా శుష్కించుకుపోయిన కుదుళ్లు తిరిగి శక్తివంతమై మళ్లీ జుత్తు మొలిపించడం ఈ చికిత్స లో సులభసాధ్యమైంది.
మెసోథెరపీ
ప్లేట్‌లెట్‌రిచ్‌ ప్లాస్మా (పి.ఆర్‌.పి) అనేది రక్తంలో కనిపించే ప్లేట్‌లెట్‌ మిశ్రమంతో కూడిన బ్లడ్‌ ప్లాస్మా ఇది రోగి శరీరంలోని రక్తం నుంచి తీయడం జరుగుతుంది. ఇది ఒక విధంగా సర్జరీకి ముందు రోగి తన రక్తాన్ని తన కోసం దానం చేయడం లాంటిది. మరోవిధంగా చెప్పాలంటే ప్లాస్టిక్‌ సర్జరీ నిమిత్తం రోగి శరీరం నుంచి చర్మాన్ని తీసి అతనికి వేరేచోట అతికించడం లాంటిది. దీని వలన ఎటువంటి దుష్ప్రభావాలు వుండవు