header

Health Bits

కాఫీ టీలు త్రాగవచ్చా ? కాఫీ, టీలు రెండూ అనారోగ్యమే. భోజనానికి ముందు, భోజనం తర్వాత ఓ గంటసేపు అసలు త్రాగకూడదు. ఇవి ఆహారంలోని ఐరన్ సామర్థ్యాన్ని దెబ్బ తీస్తాయి. కార్బోనేటెట్ పానీయాలు మంచిది కాదు. జీర్ణ వ్యవస్థను దారితప్పస్తాయి. వాటి బదులు పళ్ళరసాలు, మజ్జిగ, కొబ్బరినీళ్ళు తీసుకోవచ్చు. జాతీయ పోషకాహార సంస్థ (యన్ ఐ యన్)

పచ్చిపాలు త్రాగవచ్చా ? పచ్చిపాలు త్రాగితే ఆరోగ్యానికి మంచిదనే నమ్మకం వుంది. కాని దీనికి శాస్త్రీయత లేదు. పాలను ఓ స్థాయివరకు మరిగించితే వాటిలోని హానికర సూక్ష్మజీవులు నాశనం అవుతాయి. వేడి చేయకుండా త్రాగితే అనారోగ్యాన్ని కొని తెచ్చికున్నట్లే. జాతీయ పోషకాహార సంస్థ (యన్ ఐ యన్)

నీళ్ళు ఎన్ని త్రాగాలి? రోజుకు కనీసం రెండు లీటర్లు ఒంట్లోకి వెళ్ళాల్సిందేనని జాతీయ ఆహార సంస్థ చెప్పింది.

ఉప్పు...ముప్పు.. జాతీయ ఆహార సంస్థ తాజా నియమావళిలో రోజుకు 6 గ్రాములకంటే ఒక్క రవ్వ ఎక్కువైనా కష్టమేనని హెచ్చరిక జారీచేసింది. నిజానికి 2.4 నుండి 4 గ్రాములు మించకూడదని అంతర్జాతీయ సంస్థల హెచ్చరిక. సాధారణంగా భారతీయ కుటుంబాలలో రోజులు 10 గ్రాముల ఉప్పు వాడతారని అంచనా. శరీరంలో ఉప్పు ఓ స్థాయి దాటితే అధిక రక్తపోటు, ఉదర క్యాన్సర్ వంటి సమస్యలు రావచ్చు.

పిల్లలకు పాలు ఎంతకాలం అమ్మపాలు ఇవ్వాలి ? తల్లిపాలు అమృతంతో సమానమని మరోసారి గుర్తుచేస్తుంది పోషకాహార సంస్థ. గరిష్ఠంగా రెండేళ్ళవరకూ ఇవ్వవచ్చని చెబుతుంది.తల్లి పాలలోని కొలస్ట్రమ్ లో అపార పోషక విలువలు ఉన్నాయి. ఆ మురిపాలతో తల్లీ బిడ్డల అనుభంధాలు బలపడతాయని నిపుణులు చెబుతున్నారు. పుష్కలంగా తల్లిపాలు త్రాగిన బిడ్డలలో పెద్దయ్యక రోగనిరోధక శక్తి కూడా ఎక్కువగా ఉంటుంది. ఊబకాయం కొన్ని రకాల క్యాన్సర్లు దరిచేరే ప్రమాదం తక్కువని అధ్యయనాలు చెబుతున్నయి. జాతీయ పోషకాహార సంస్థ (యన్ ఐ యన్)

మాయదారి తిండి...చిప్స్, చాక్లెట్లు, ఫ్రెంచ్ ఫ్రైస్ వగైరా.. ఇవి కమ్మ కమ్మగా కడుపులోకి దూరిపోయి మెల్ల మెల్లగా మనల్ని కష్టపెడతాయి. వీటిలో పోషక విలువలు ఉండవు. ఉప్పు, చెక్కర, కొవ్వు పదార్థాలు ఎక్కువ. మరియి ప్రమాదకర రసాయనాలు ఉండవచ్చు. సంప్రదాయమైన చిరుతిళ్ళే ఉత్తమం. ఇంట్లో వండుకు తినే ఆహారం మాత్రమే ఆరోగ్యకరం. రెడీ టు ఈట్ రుచులు కృతకమైనవి. పిల్లలైనా పెద్దలైనా విటికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. జాతీయ పోషకాహార సంస్థ (యన్ ఐ యన్)

ఇల్లాలికి పోషకాహార సంస్థవారి సలహాలు : నిల్వపచ్చళ్ళు, అప్పడాలు వేపుళ్ళు బాగా తగ్గించాలి. కూరగాయలను ఆకుకూరలను ఉప్పు కలిపిన నీళ్ళలో శుభ్రంగా కడిగిన తరువాతే తరగాలి. తరిగాక కడగటం మంచిది కాదు. కూరగాయలను చిన్న చిన్న ముక్కలుగా కోయటం వలన పోషక విలువలు తగ్గిపోతాయి. మరీ ఎక్కువసేపు నాన బెట్టటం వలన కొన్ని రకాల విటమిన్లు ఖనిజాలు కరిగిపోతాయి.వంటలలో నూనెలు తక్కువగా వాడాలి.నెయ్యి వెన్నలకు సాధ్యమైనంత దూరంగా ఉండాలి. పాల ఉత్పత్తులు, మాంసం, వండిన పదార్థాలు నిల్వ చేయటంలో ఏ మాత్రం నిర్లక్ష్యం చూపినా అవి విషతుల్వంగా మారతాయి. రంగు, రుచిలో తేడా కనిపిస్తే చెత్తబుట్టలో పడవేయటం మంచిది.

మాంసాహరులు చికెన్, మటన్ లను తగ్గించుకొని వారానికి 100 నుంచి 200 గ్రాముల చేపలు తీసుకోవాలి. జంతువుల కాలేయం, మూత్రపిండాలు, మెదడు అసలు వద్దు.