telugukiranam

Dubai Tourism…దుబాయ్ పర్యాటకం....

Dubai Tourism…దుబాయ్ పర్యాటకం....
దుబాయ్ ఎడారిదేశం... భానుడి ప్రతాపానికి తిరుగుండదు. చుక్క వాన కురవకపోయినా అద్భుతమైన పూలతోటల్నీ పెంచుతున్నారు. భూమ్మీద సముద్రాన్నీ, సముద్రంలో భూమినీ నిర్మించారు. ఎత్తైన కట్టడాలను ఆకాశంలోకి నిర్మించారు. నీటిలోని జంతుప్రదర్శనశాలలతో సాగర లోతుల్నీ చూపిస్తారు. మొత్తంగా ఎడారి జీవితాన్ని అద్భుతంగా తీర్చి దిద్దిన దుబాయ్... విలాసానికీ వినోదానికీ రాజరికానికీ రాజసానికీ నిలువెత్తు ప్రతిరూపం దుబాయ్. . బెల్లీ నృత్యానికి పేరుపొందిన దేశం దుబాయ్. రోడ్టు చక్కగా మెరుస్తూ ఉంటాయి
కార్నిచ్ బీచ్
అబుదాబిలోనే విలాసవంతమైన కార్నిచ్ బీచ్. అది సహజంగా ఏర్పడిన బీచ్ కాదు. సముద్రాన్ని కొంత దూరం మళ్లించిన నీటిపాయల వల్ల ఏర్పడిన బీచ్. తెల్లని ఇసుకనీ నీలి సముద్రాన్నీ చూస్తూ ఆనందించవచ్చు
అబుదాబి...
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ రాజదాని అబుదాబి. పర్షియన్ గల్ఫ్ సముద్ర తీరానికి ఆనుకుని ఉంటుందీ నగరం. రాజధాని కావడంతో అధికార కార్యాలయాలు ఎక్కువ. అన్నీ అద్దాల మేడలు, ఆకాశహార్మ్యాలు కనబడతాయి. ఎతిహాద్ టవర్స్, పైనాపిల్ బిల్డింగ్స్...వంటి ఆర్కిటెక్చర్ అద్భుతాలెన్నో కనిపిస్తాయి.
గ్రాండ్ మాస్క్ మసీదు
యూఏఈ జాతిపిత షేక్ జాయెద్ బిన్ సుల్తాన్ అల్ నహయాన్ స్వప్నమే ఈ మసీదు. ప్రపంచాన్ని ఏకం చేయాలనే ఉద్దేశంతో ఈ ప్రార్థనా మందిరం నిర్మించబడింది. పదేళ్లపాటు మూడువేల మంది ఈ మసీదు నిర్మాణంలో పాల్గొన్నారు. ఇందులోని ప్రార్థనా మందిరంలో ఉన్న కార్పెట్, షాండ్లియర్స్ ఈ మసీదుకి ప్రత్యేక ఆకర్షణ. ప్రధాన ప్రార్థనా మందిరం గోడమీద అల్లా 99 పేర్లు కనిపిస్తాయి. వందో పేరు అల్లాకే కనిపిస్తుందని అంటారు.
పామ్ జుమేరా బీచ్
ఈ బీచ్ మెట్రోలో ఖర్జూర చెట్టు ఆకారంలో నిర్మించిబడినది. పామ్ జుమేరా బీచ్ ప్రాంతం విలాసవంతమైన బీచ్ విల్లాలకు పెట్టింది పేరు. దుబాయ్ లో మరొక ప్రధాన పర్యటక ప్రాంతం అల్ అరబ్ హోటల్ దగ్గర ఉన్న బీచ్.
దుబాయ్ బంగారానికీ సుగంధ ద్రవ్యాల వ్యాపారానికీ నిలయం. ఆసియా దేశాల నుంచి వచ్చే సుగంధ ద్రవ్యాలు ఇక్కడినుంచి ఆఫ్రికాకు ఎగుమతి అవుతుంటాయి. దుబాయ్ మార్కెట్ లో సుగంధ ద్రవ్యాలు రాశులుగా పోసి అమ్ముతారు. ఇతరదేశాలతో పోలిస్తే దుబాయ్ లో బంగారం ధర తక్కువ. ఆభరణ ప్రియులకి పండగే.
దుబాయ్ మ్యూజియం
అరబ్బుల జీవనశైలి, ఆచార వ్యవహారాలు, వాళ్లు ఎదిగినతీరు అన్నీ ఈ మ్యూజియంలో కనబడాతాయి. మెరీనా మాల్లోని జెయింట్ వీల్ ఎక్కి అబుదాబి నగర అందాలను చూడవచ్చు.
ఎడారి సఫారీ!
దుబాయ్, షార్జా జంట నగరాలు. షార్జా నుంచి 40 కిలోమీటర్ల దూరంలో డెజర్ట్ సఫారీ సెంటర్ ఉంది. సాయంత్రం నాలుగు గంటల నుంచి రాత్రి తొమ్మిదిన్నర వరకూ ఈ సఫారీ ప్యాకేజీ సాగుతుంది. ల్యాండ్ క్రూయిజ్ కార్లలో సఫారీ మొదలౌతేంది. ఓ పక్క అప్పటివరకూ నిప్పులు కక్కి చల్లగా జారుకుంటున్న సూరీడు... దూరంగా ఎడారి ఓడల బారులు... ఇసుకతిన్నెలపై ప్రయాణిస్తూ కొండలూ లోయలూ... చూస్తూ ఆనందించవచ్చు. ఇసుకతిన్నెల మధ్యలో సూర్యాస్తమయం అద్భుతంగా ఉంది.
బుర్జ్ ఖలీఫా - ఎత్తైన నిర్మాణం!
ప్రపంచంలోకెల్లా ఎత్తైన నిర్మాణం బుర్జ్ ఖలీఫా. ఇది ఎక్కడానికి రుసుము చెల్లించాలి. దుబాయ్ డౌన్టౌన్ అభివృద్ధిలో భాగంగా ఈ బుర్జ్ ఖలీఫాను నిర్మించారు. 160 అంతస్తుల ఈ భవనంలో పర్యాటకులను 125 అంతస్తుల వరకూ అనుమతిస్తారు. కేవలం ఒక్క నిమిషంలోనే లిఫ్ట్ లో పైకి చేరుకోవచ్చు. ఎత్తైన స్విమ్మింగ్ ఫూల్, మసీదు, ఎత్తైన నైట్ క్లబ్... ఇలా పదికి పైగా రికార్డులు బుర్జ్ ఖలీఫాకు ఉన్నాయి దుబాయ్ మాల్లోని రెండంతస్తుల ఆ అక్వేరియంలో 4,800 జాతులకు పైగా జలచరాలు ఉంటాయి.
దుబాయ్ పార్కులు
అబుదాబి నుంచి దుబాయ్ కు వెళ్లే షేక్ జాయెద్ రహదారి పక్కన ఈ పార్కులు ఉన్నాయి. మోషన్ గేట్, లెగో ల్యాండ్, బాలీవుడ్ పార్కు మూడింటినీ కలిపి దుబాయ్ పార్కులు అంటారు. బాలీవుడ్ పార్కు అంతా హిందీ సినిమాలోకం. సల్మాన్, అమితాబ్ డూప్ల నృత్యాలు ఆకట్టుకుంటాయి
హైదరాబాద్ విమానాశ్రయం నుంచి దుబాయ్ వెళ్లవచ్చు.