telugukiranam

Kailash and Mansarovar Tourism /మానస సరోవరం మరియు కైలాస పర్వత యాత్ర

Kailash and Mansarovar Tourism /మానస సరోవరం మరియు కైలాస పర్వత యాత్ర
mansarovar సాక్షాత్తు శివుడు కొలువైన ఆ కైలాస పర్వతాన్ని, దేవతల సరస్సుగా భావించే మానస సరోవరాన్నీ చూడాల్సిందే తప్ప వర్ణించటం వీలుకాదు.
మానస సరోవరం, కైలాస శిఖరం రెండూ టిబెట్‌లోనే ఉన్నాయి.
భారతీయులకు, నేపాలీలకు, టిబెటన్లకు మానససరోవరం ఓ పవిత్రవైన స్థలం. మానససరోవరంలోని మంచినీరు ప్రపంచంలోనే స్వచ్ఛమైన జలంగా పేరుపొందినది. ఈ సరోవరంలో తిరిగే తెల్లని హంసలు చూపరులకు కనువిందు చేస్తాయి.
టిబెట్‌ ఓ ఎత్తైన పీఠభూమి. ప్రస్తుతం టిబెట్ చైనా వారి ఆక్రమణలో ఉన్నది. అక్కడ పగలు ఎండా, రాత్రి చలీ విపరీతంగా ఉంటాయి.
మానససరోవరం వెళ్లాలంటే ముందుగా నేపాల్ లోని లఖ్‌నవూకి వెళ్లాలి. అక్కడి నుండి ట్రావెల్‌ ఏజెన్సీ వాళ్లు నేపాల్‌ గంజ్‌కు తీసుకువెళతారు. నేపాల్‌ గంజ్‌ కు నాలుగు గంటల రోడ్డు ప్రయాణం. అన్ని సౌకర్యాలూ ఉన్న హోటల్‌ గదులు ఇక్కడ ఉంటాయి.. నేపాల్‌ గంజ్‌లో శక్తిపీఠంగా పిలవబడే భాగేశ్వరి అమ్మవారి ఆలయం ఉంది.
దేవలోకం!
మానస సరోవరంలోని పవిత్ర జలాలను తాకాలనే సంకల్పం ఉంటే సరిపోదు. ఓపిక, సహనం ఉండాలి. కష్టాలను తట్టుకోవాలి. ఊహించని వాతావరణ పరిస్థితులు, మంచుగాలులు ఉక్కిరిబిక్కిరి చేస్తుంటాయి. ఎగుడు దిగుడు పర్వతాల మీదుగా యాత్రంతా సాహసోపేతంగా సాగిపోతుంటుంది
టిబెట్‌ పీఠభూమిలోని సరస్సులన్నీ ఉప్పునీటి సరస్సులే కాని.. మానస సరోవరం మాత్రం పూర్తిగా మంచినీటి సరస్సే. దీనికి సమీపంలో ఉన్న రాక్షస్‌తాళ్‌ కూడా ఉప్పునీటి సరస్సే.
మానస సరోవర్‌ లోతు 300 అడుగులు. పరిధి సుమారు 90 కిలోమీటర్లు. ఉపరితల విస్తీర్ణం 320 చదరపు కిలోమీటర్లు. ప్రపంచంలోని అతిపెద్ద మంచినీటి సరస్సుల్లో ఇదొకటి.
మానస సరోవరం... ఆసియాలోని పలు దేశాలకు జీవనదులైన.. సింధు, సట్లెజ్‌, బ్రహ్మపుత్ర, కర్నాలి (గంగానదికి ఉపనది) పుట్టినిల్లు.
అక్కడనుండి హిల్‌సా అనే గ్రామానికి వెళ్లవలసి ఉంటుంది. ఈ గ్రామం సముద్ర మట్టానికి 3640 మీ. ఎత్తులో నేపాల్‌కీ టిబెట్‌కీ సరిహద్దులో ఉంది. చుట్టూ కొండలూ వాటిమధ్యలోంచి పారే సెలయేర్లూ... ఆ ప్రదేశం ఎంతో మనోహరంగా ఉంటుంది.
ఈ వాతావరణంలో ఆల్టిట్యూడ్‌ సిక్‌నెస్‌ కారణంగా తలనొప్పి వస్తుంది. అది తగ్గాలంటే డయామాక్స్‌ మాత్రలు వేసుకోవాలి.
మానస సరోవరం!
తరువాత హిల్‌సా నుంచి సరిహద్దు దాటి చైనాలోకి వెళ్లాల్సి ఉంటుంది. యాత్రా నిర్వాహకులు అన్ని ఏర్పాట్లూ చేస్తారు. ఈ యాత్రకు పాస్‌పోర్టు తప్పనిసరి. ప్రభుత్వంతోబాటు ప్రైవేటు సంస్థలు కూడా ఈ యాత్రను నిర్వహిస్తున్నాయి, మన పాస్‌పోర్టును వాళ్లకు పంపిస్తే, వాళ్లే చైనా ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకుంటారు. అదే గతంలో అయితే ప్రభుత్వం మాత్రమే కైలాసమానస సరోవర యాత్రను నిర్వహించేది.
చైనా ఇమిగ్రేషన్‌ చాలా కఠినం. అక్కడినుండి నాలుగు చెక్‌పాయింట్లు దాటి తకలా కోట్ కు వెళ్లాల్సి ఉంటుంది. ఈ తకలా కోట్‌ సముద్ర మట్టానికి 4025 మీ. పైన ఉంది. అక్కడ మన రూపాయల్ని చైనా యెన్‌ల్లోకి మార్చుకోవాలి. మళ్లీ ఓ చెక్‌ పాయింట్‌ దాట వలసి ఉంటుంది. దారిలో ముందుగా రాక్షస స్థల్‌ అనే ప్రాంతం వస్తుంది. ఇది రావణాసురుడు సృష్టించుకున్న ఓ పెద్ద సరోవరం అని చెబుతారు.
ఇది మానస సరోవరానికి పడమర దిక్కుగానూ కైలాసానికి దక్షిణంగానూ ఉంటుంది.
అక్కడి నుంచి మానస సరోవరం 23కి.మీ. దూరంలో ఉంది.. నీలం రంగులో ఎంతో ప్రశాంతంగా ఉంటుందీ సరస్సు. సుమారు 88 కి.మీ. చుట్టుకొలత ఉంటుంది. మానససరోవరంలో స్నానం చేయటం ఓ అదృష్టంగా భావిస్తారు.
సరోవరంలో నీరు చాలా చల్లగా తేటగా మెరుస్తుంటాయి. టూర్ నిర్వాహకులు సమీపంలోనే సుమారు 20 అడుగుల దూరంలోనే గుడారాలు వేసి వసతి ఏర్పాట్లు చేస్తారు.
తరువాత పేజీలో ......