header

Cooking Oils / వంటనూనెలు

Cooking Oils / వంటనూనెలు

వంటనూనెలు – ప్రయోజనాలు
మార్కెట్లలో అనేక బ్రాండ్ ల వంటనూనెలు ఉన్నాయి. వీటిలో ఏది ఎంచుకోవలన్నది వారి వారి ఛాయిస్ ను బట్టి ఉంటుంది. ఏ వంటనూనెతో ఏ ఏ ప్రయోజనాలున్నాయో అవగాహన ఉంటే వాటిని ఎంచుకోవటం సులభమవుతుంది. పోషకాహార నిపుణులు ఏప్పుడూ ఒకే రకమైన నూనె కాకుండా అన్ని రకాల నూనెలు మార్చి మార్చి వాడుతుంటే అన్ని రకాల ప్రయోజనాలు ఉంటాయని చెబుతున్నారు. గడ్డకట్టే స్వభావం ఉన్న నూనెలు ఎక్కువగా వాడరాదని వైద్యులు సూచిన్నారు. సాచురేటెడ్ నూనెలు ఎక్కువగా కొవ్వు పదార్ధాలు కలిగి ఉంటాయి. అన్ సాచురేటెడ్ నూనెలలో కొవ్వుపదార్దాలు తక్కువగా ఉంటాయి. ఏది ఏమైనా నూనెలు తగుమాత్రంగా, మితంగా వాడాలని లేకుంటే అధిక బరువు, గుండె జబ్బులు తప్పవంటున్నారు పోషకాహార నిపుణులు.
సాచురేటెడ్ నూనెలకు (కొవ్వు) కొన్ని ఉదాహరణలు
Meats
Butter
Whole milk
Poultry
Coconut oil
Palm oil
అన్ సాచురేటెడ్ నూనెలకు (కొవ్వు) కొన్ని ఉదాహరణలు
Sunflower oil
Canola oil
Olive oil
Peanut oil
Hazelnuts
Avocados
Omega-3 good Sources
Seafood- High fat mackerel, albacore tuna, sardines, salmon, lake trout
Flaxseed oil
Walnuts
Soybean oil
Canola oil
Polyunsaturated fatty acids (PUFAs)
Flaxseed oil
Corn oil
Sesame oil
Sunflower seeds and sunflower oil
Fatty fish, i.e. Salmon
Walnuts

కొన్ని నూనెల గురించి........
ఆవనూనె
ఆవనూనెను ఆరోగ్యవంతమైన వంటనూనెగా చెబుతారు. ఎందుకంటే ఇందులో మోనో అన్ సాచురేటెడ్ ఫ్యాట్స్ ఎక్కువగా ఉంటాయి. యాంటి ఆక్సిడెంట్స్, విటమిన్ ఇ అత్యధికంగా ఉంటాయి. ఆవనూనె కొలస్ట్రాల్, గుండె జబ్బుల అవకాశాన్ని తగ్గంచే గుణాలు కలిగి ఉంటుంది.
ఆవనూనెతో వండిన చేపలకూర ప్రత్యేకమైన రుచి కలిగిఉంటుంది.

ఆలివ్ నూనె
ఆవనూనెలో మోనో సాచురేటెడ్ ఫ్యాట్స్ 75 శాతం అత్యధికంగా ఉండటం వలన దీనిని ఉత్తమమైనది అని అంటారు. అనేక విలువైన యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఉంటాయి. వంట పూర్తవుతుండాగా చివరిలో కొద్దిగా ఆలివ్ ఆయిల్ కలిపితే రుచి పెరుగుతుందంటారు.

సోయాబీన్ ఆయిన్
ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉండే ఈ నూనె ఎక్కువగా ఉపయోగంలో ఉండి. పాలి అన్ సాచురేటెడ్ కు ఆధారం ఈ నూనె. సోయాబీన్ నూనెను నిలవ ఉంచకుండా తాజాగా వాడుకోవటం మంచిదంటారు నిపుణులు.

సన్ ఫ్లవర్ ఆయిల్
పుఫా, విటమిన్ ఇ అత్యధికంగా ఉంటాయి. సాచురేటెడ్ ఫ్యాట్స్ తక్కువగా ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్ప్ పుష్కలంగా ఉంటాయి. రోగనిరోధక వ్యవస్థ బలబడుతుంది. నాడీవ్యవస్ధ సక్రమ పనితీరుకు సహాయపడుతుంది. ఎక్కువగా వినియోగించే నూనెలలో ఇది ఒకటి.

రైస్ బ్రాన్ నూనె
హైస్మోక్ పాయింట్ గల నూనె. తెలికపాటి ఫ్లేవర్ కలది. ముఫా, పుఫా, ఎస్ ఎఫ్ ఏ తగుపాళ్లలో ఉండే లత్యంత సమతౌల్య పూరితమైన నూనె. లైట్, న్యూట్రల్ ఫ్లేవర్ కలిగి ఉంటుంది. తక్కువ సెగలో, అత్యధిక సెగలో వండటాని అనుకూలంగా ఉంటుంది.

కొబ్బరి నూనె
కొబ్బరినూనెలో తొంభై శాతానికి మించి సాచురేటెట్ ఫ్యాట్స్ ఉంటాయి. కానీ కొలెస్ట్రాల్ ఉండదు. ఇంచు మించు వెన్నతో సమానమైనది. దీనిలోని సాచురేటెడ్ ఫ్యాట్స్ జంతు సంభందిత కొవ్వులకు భిన్నంగా ఉండి హెచ్ డి ఎల్ కొలస్ట్రాల్ ను పెంచటం ద్వారా బ్లడ్ కొలస్ట్రాల్ స్థాయిలను మెరుగు పరుస్తుంది. విటమిన్ ఇ, కె, ఐరన్ వంటి ఖనిజాలు లభిస్తాయి. కేరళలో దీని వాడకం ఎక్కువ.

కెనోలా ఆయిల్
ఆవనూనెతో సారూప్యం కలిగి ఉంటుంది. సాచురేటెడ్ ఫ్యాట్స్ తక్కువగా ఉంటాయి. మోన్ అన్ సాచురేటెడ్ ఫ్యాట్స్ ఎక్కువగా కలిగి ఉంటుంది. ఉపయోగకరమైన ఒమేగా3 ఫ్యాటీ యాసిడ్ గుణాలు ఎక్కువగా ఉంటాయి. తేలికపాటి ఫ్లేవర్, హైస్మోక్ పాయింట్, మృదువైన టెక్చర్ అన్నీ కలిపి ప్రత్యేకమైన వంటనూనెగా పేరు పొందింది.