కావలిసినవి
సజ్జలు : 2 కప్పులు
బియ్యం : 1 కప్పు
మినపప్పు : అరకప్పు
బియ్యం, మినపపప్పు, సజ్జలను ఉదయం నుండి సాయంత్రం దాకా నానబెట్టుకోవాలి. సాయంత్రం ఈ మూడింటిని కలిపి దోశెపిండిలాగా గ్రైండ్ చేయించుకోవాలి. రాత్రంతా పిండిని అలాగే ఉంచాలి (పులియబెట్టటం లేక ఫెర్మంటేషన్ అంటారు)
ఉదయానికి దోశెపిండి తయారవుంది. వీటిని మామూలు దోసెలు వేసుకునే విధంగా వేసుకుని కొద్దిగా నూనె చల్లి రెండువైపులా కాలనివ్వాలి. కాంబినేషన్ గా ఏదైనా చట్నీతో వడ్డించాలి.