కావలిసినవి:
గోధుమ పిండి : 1 కప్పు
బియ్యపు పిండి : పావు కప్పు
బొంబాయి రవ్వ : పావు కప్పు
పచ్చిమిర్చి : 4
కొత్తిమీర : కొద్దిగా
ఉప్పు : రుచికి తగినంత
తయారు చేసే పద్దతి :
ముందుగా కొత్తీమీర పచ్చిమిర్చి చక్కగా సన్నగా తరుగుకోవాలి.
ఒక వెడల్పాటి పాత్రలో బియ్యంపిండి, గోధుమపిండి, బొంబాయిరవ్వ, జీలకర్ర, తగినంత ఉప్పు వేసి తరిగిన కొత్తిమీర, పచ్చిమిర్చి కూడా కలిపి తగినంత నీరు కలిపి దోసెల పిండిమాదిరిగా కలుపుకోవాలి.
తరువాత పెనం వేడెక్కిన తరువాత మామూలు దోసెలు లాగా వేసుకొని కొద్దిగా నూనె వేసి రెండుప్రక్కలా కాల్చుకోవాలి.
ఏదైనా చట్నీతో తినవచ్చు.