

 
కావలిసినవి
జొన్నలు :  మూడు కప్పులు
మినపపప్పు : ఒక కప్పు
ఉప్పు : తగినంత
జొన్నలు, మినపప్పును ఉదయం నుండి సాయంత్రం దాకా నానబెట్టుకుని గ్రైండ్ చేయించి రాత్రంతా అలాగే ఉంచాలి. దీనినే పులియబెట్టటం (ఫెర్మంటేషన్) అంటారు.  ఉదయానికి దోసెల పిండి తయారవుతుంది. పెనం వేడెక్కిన  తరువాత పెనంమీద కొద్దిగా నూనెతో తుడిచి దోసెలు వేసుకోవచ్చు.స్పూనుతో  కొద్దిగా నూనె వేసుకోవాలి. దోసె వేసే ముందు పెనం మీద కొద్దిగా నీళ్ళు  చిలకరిస్తే దోసెలు పలచగా వస్తాయి. రెండు వైపులా కాలిన తరువాత తీయాలి. 
మినప దోసెలకు అల్లం చట్నీ, సెనగపప్పు చెట్నీ, వెరుశెనగ గుండ్ల చట్నీ లేక వెరుశెనగ గుండ్లు, శెనగపపప్పు రెండూ 
కలిపిన చట్నీ మంచి కాంబినేషన్ .