కావల్సినవి
బియ్యం : 1 కప్పు
పెసరపప్పు,మినపప్పు, పచ్చిసెనగపప్పు, కందిపప్పు: అన్నీ కలిపి 1 కప్పు
మెంతులు : 1 టేబుల్ స్పూన్
ఉల్లిపాయలు : 2 సన్నగా తరిగినవి
కరివేపాకు : రెండు రెమ్మలు
కొత్తిమీర : 1 కట్ట
ఉప్పు : తగినంత
నూనె : కొద్దిగా
తయారు చేసే విధానం
బియ్యాన్ని ముందురోజు రాత్రి నానబెట్టుకోవాలి
మిగతా వాటిని కూడా ముందురోజు రాత్రే నానబెట్టుకోవాలి
మరసటి రోజు ఉదయాన్నే అన్నింటిని శుభ్రంగా కడిగి నీరు తీసివేసి అట్టుపిండి మాదిరిగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసేటప్పుడు తగినంత ఉప్పు కలుపుకోవాలి.
ఇప్పుడు స్టవ్ వెలిగించి పెనం పెట్టి వేడెక్కిన తరువాత దోశెలు ఎలా వేస్తారో అలాగే వేసి పైన కొద్దిగా ఉల్లిపాయలు ,
కొత్తిమీర, కరివేపాకు చల్లుకోవాలి.