header

Oats Dose


ఓట్స్ దోసె

కావలిసినవి
ఓట్స్ : 2 కప్పులు
బియ్యపు పిండి : అరకప్పు
బొంబాయి రవ్వ : అరకప్పు
పెరుగు : 2 స్పూన్లు
ఉప్పు : తగినంత
అల్లం : కొద్దిగా తురుముకోవాలి
పచ్చిమిర్చి : 2 లేక మూడు కాయలు
జీలకర్ర : 1 టేబుల్ స్పూన్
తయారు చేసే పద్ధతి
ముందుగా ఓట్స్ ను సువాసన వచ్చేదాకా మాడకుండా వేయించుకోవాలి వీటిని ఆరనిచ్చి పొడి చేసుకోవాలి
ఒక పాత్రలో ఈ ఓట్స్ పిండిని, బొంబాయి రవ్వను, బియ్యం పిండి, సన్నగా తరిగిన పచ్చిమిర్చి, జీలకర్ర, తురిమిన అల్లం, పెరుగు, కొత్తిమీర, తగినంత ఉప్పు కలపి కొద్ది కొద్దిగా నీళ్ళు పోస్తూ దోసెల పిండి మాదిరిగా కలుపుకోవాలి.
తరువాత ఈ మిశ్రమాన్ని దోశెలులాగా వేసి కొద్దిగా నూనె వేసుకొని రెండువైపులా కాల్చకోవాలి. ఏదైనా చట్నీతో తినవచ్చు