header

Pomegranate Jelly…..దానిమ్మతో జెల్లీ...

Pomegranate Jelly…..దానిమ్మతో జెల్లీ...

కావలిసినవి
దానిమ్మ రసం : ఒకటింపావు కప్పు
పంచదార : రెండు కప్పులు
ఆగర్ : ఒకటిన్నర చెంచాలు
తయారు చేసే విధానం
సగం దానిమ్మ రసంలో ఆగర్ వేసి పక్కన పెట్టుకోవాలి. తక్కిన రసంలో పంచదార వేసి పాన్ లో పోసి ఐదునిమిషాల పాటు మరిగించుకోవాలి. ఆగర్ కలిపిన రసాన్ని కూడా బాగా కలిపి ఐదు నిమిషాలపాటు మరగపెట్టుకోవాలి. వేడిగా ఉండగానే వడగట్టుకొని పంచదార రసంలో కలుపుకోవాలి. తరువాత ఈ రసాన్నంతా అంగుళం తోతున్న ట్రేలో పోసి 3 గంటలపాటు ఫ్రిజ్ లో ఉంచితే దానిమ్మ జెల్లీ రెడీ.