కావల్సినవి
పుచ్చకాయ : ఒకటి
పంచదార : తగినంత
ఆగర్ : అరచెంచా
ముందుగా పుచ్చకాయను అడ్డంగా రెండుగా కోయాలి. తరువాత దానిలోని గుజ్జునంతా తీసి పుచ్చకాయ డొప్పలను విడిగా ఉంచుకోవాలి. పుచ్చకాయ గుజ్జును మిక్సీలో వేసి జ్యూస్ చేసుకొని దానిని వడకట్టుకొని పిప్పి పారవేసి సగం రసంలో ఆగర్ ను వేసి కరగనివ్వాలి. మిగిలిన రసంలో పంచదార వేసి పాన్లో పోసి పొయ్యిమీద పెట్టి ఐదునిమిషాలు మరగించాలి. పంచదార కరిగిన తరువాత ఆగర్ కలిపిన రసం కూడా అందులో పోసి ఐదు నిమిషాల పాటు పొయ్యిమీదే ఉంచాలి. తరువాత ఈ రసాన్ని ఖాళీ పుచ్చకాయ డొప్పలలో పోసి జాగ్రత్తగా ఫ్రిజ్ లో ఒక రాత్రంతా ఉంచాలి. తెల్లారిన తరువాత పుచ్చకాయ డొప్పలలోని జెల్ ను కావలసిన సైజులో కోసుకోవాలి.