header

Biryani Leaves / బిర్యానీ ఆకులు...

Biryani Leaves / బిర్యానీ ఆకులు...

బిర్యానీలూ పలావుల్లో వాడే ఆకులు మనందరికీ సుపరిచితమే. కానీ వీటిని సువాసన కోసమే వాడి వదిలేస్తుంటాం. కానీ ఈ ఆకుల్లో విటమిన్‌-సి, ఎ, మాంగనీస్‌, ఐరన్‌, కాల్షియం, మెగ్నీషియం... వంటి పోషకాలెన్నో ఉన్నాయి. ఇంకా వీటిల్లోని యూజెనాల్‌, క్యుయెర్సెటిన్‌, కెటెచిన్‌...వంటి ఆమ్లాలు క్యాన్సర్‌ కంతులు రాకుండా అడ్డుకుంటాయి. అందుకే ఈ ఆకుల్ని తేయాకు మాదిరిగానే తుంపి మరిగించి టీలా కూడా తీసుకోవచ్చు అంటున్నారు ఆయుర్వేద వైద్యులు.
-- తాజా ఆకులు పదిహేనువరకూ తీసుకుని ముక్కలుగా తుంచి మూడు కప్పుల నీళ్లలో వేసి వాటిని ఓ కప్పు అయ్యేలా మరిగించి చల్లారాక రోజూ రాత్రిపూట తీసుకుంటే కొలెస్ట్రాల్‌, మధుమేహం... వంటి వ్యాధులు తగ్గుముఖం పడతాయట.
-- వూబకాయంతో బాధపడేవాళ్లు సుమారు 30 ఆకుల్ని తీసుకుని నాలుగు కప్పుల నీళ్లలో వేసి రెండు కప్పులయ్యేవరకూ మరిగించి రోజుకి రెండుపూటలా కప్పు చొప్పున తీసుకుంటే మంచి ఫలితం ఉంటుందట. ఈ ఆకుల్ని మరిగించిన నీరు బీపీ రోగులకూ మంచిదేనట.
-- తరచూ అల్సర్లతో బాధపడేవాళ్లు కూడా ఈ ఆకుల్ని అరలీటరు నీళ్లలో వేసి పావుగంటసేపు మరిగించి కాస్త పంచదార వేసుకుని టీలా తీసుకుంటే ఆ నొప్పి తగ్గుతుంది. ఈ నీరు డయేరియాకు కూడా మంచి మందులా పనిచేస్తుందట.
-- ఈ ఆకుల్నీ కమలాతొక్కల్నీ ఎండబెట్టి నీళ్లతో మెత్తగా రుబ్బి పేస్టులా వాడితే దంతాలు తెల్లగా మెరిసిపోతాయి.