header

Cardamom/ యాలకులు


Cardamom/ యాలకులు
యాలకుల్లో మాంసకృత్తులూ, పీచూ, పిండిపదార్థాలతోపాటూ మరెన్నో పోషకాలూ ఉంటాయి. యాలకుల్లోని ఇనుము, రాగి, విటమిన్-సి, రైబోఫ్లేవిన్ రక్తహీనతను నివారిస్తాయి. ప్రతిరోజూ పడుకునే ముందు గ్లాసు గోరువెచ్చటి పాలల్లో అరచెంచా యాలకులపొడీ, పసుపూ, చక్కెరా వేసుకుని తాగడం వల్ల రక్తహీనత తగ్గుతుంది.
పొటాషియం, మెగ్నిషియం, క్యాల్షియంలతోపాటు యాలకుల్లో కావాల్సినంత స్థాయిలో ఎలక్ట్రోలైట్లు ఉంటాయి. పొటాషియం గుండె కొట్టుకునే వేగాన్ని క్రమబద్ధంగా ఉంచుతూ, అధికరక్తపోటు సమస్యను అదుపులో ఉంచుతుంది.
యాలకులు ఆకలినీ పెంచుతాయి. రోజూ రెండు బుగ్గన పెట్టుకుని నమిలినా చాలు.. ప్రయోజనం ఉంటుంది.
వికారం, వాంతి వస్తున్నట్టు అనిపించినప్పుడు రెండు యాలకుల్ని నోట్లో వేసుకుంటే చాలు. సమస్యలు అదుపులో ఉంటాయి.
గొంతునొప్పితో బాధపడుతున్నప్పుడు రెండుమూడు యాలకులు వేసి మరిగించిన నీటిని పొద్దున్నే పుక్కిలిస్తే ప్రయోజనం ఉంటుంది.
యాలకులని నమలడం వల్ల నోటిదుర్వాసన సమస్య అదుపులో ఉంటుంది. చిగుళ్ల సమస్యలు కూడా చాలామటుకూ తగ్గుతాయి. యాలకులతో చేసిన నూనెని పెదాలకు రాయడం వల్ల ఆరోగ్యంగా కనిపిస్తాయి. అలాగే ముఖానికి రాస్తే ఛాయ పెరుగుతుంది.