దాల్చిన చెక్క రుచిలో అద్భుతంగా ఉంటుంది. తీపి తగులుతూ అంతలో మంటనిపించే ఘాటు నషాళానికి అంటుతుంది. కోసం అనారోగ్య సమస్యలు నయం చేసేందుకు వంటలలో వాడుతుంటారు. యాంటీ ఆక్సిడెంట్లలో ఇది ఒకటి.
దీనిలో మాంగనీసు చాలా ఎక్కవ స్ధాయిలో ఉంది. పీచు క్యాల్షియం కూడా లభిస్తాయి. రోజూ ఏ రూపంలో నైనా ఒక చెంచా దాల్చిన చెక్క పౌడర్ తీసుకుంటే ఆర్ డి ఏ విలువ ప్రపకారం 22% మాంగనీస్ మనకు లభిస్తుంది.
శరీరంలో ధృఢమైన ఎముకల తయారీకి, అనుబంధ కణజాలాభివృద్ధికి తోడ్పడుతుంది. రక్తం గడ్డ కట్టటానికి మాంగనీస్ ఎంతో సహాయపడుతుంది.
సెక్స్ హార్మోనుల అభివృద్ధికి, కార్బో హైడ్రేట్స్, కొవ్వులు అరుగుదలకు, రక్తంలో చక్కెర స్ధాయిలను నియంత్రించటానికి క్యాల్షియంను శోషణ చేసుకోవటానికి, మొదడు మరింత స్థాయిలో పనిచేయటానికి మాంగనీస్ ఎంతో అవసరం.
సూక్ష్మ క్రిములను నాశనం చేసే గుణం ఉండటం వలన తలలోని పేలు పోవటానికి దీని నూనెను వాడతారు. నల్లులు, చీమలు, దుమ్ములో ఉండే క్రిములను వదిలించుకోటానికి ఎంతోఉపయోగపడుతుంది.
దీని నూనెలో దోమలను తరిమి వేసే గుణం కలదు. రోజూ ఒక అరస్పూను ఈ పొడిని తింటే రక్తంలోని చక్కెర శాతాన్ని నియంత్రిస్తుంది. కడుపు తొందరగా ఖాళీ కాకుండా, రక్తంలోని చక్కర శాతం త్వరగా పెరగకుండా అడ్డుపడుతుంది.
దాల్చిన చెక్క పొడిని సూపులలోనూ, కాఫీ, టీలలోను వాడుకోవచ్చు.
దాల్చిన చెక్క కడుపులోని ఇన్ఫెక్షన్లను పోగొడుతుంది. కడుపులోని హానికరక బ్యాక్టీరియాను చంపుతుంది.
విషపూరితమైన రూం స్ప్రేయర్లను వాడే బదులు ఒక చుక్క దాల్చిన చెక్క నూనెను నీటిలో వేసి అవసరమైన చోట స్ప్రే చేయాలి.
ఓట్స్ లోను, పండ్ల ముక్కలలోనూ దాల్చిన చెక్క పొడిని కలిపి తినవచ్చు.గ్రీన్ టీ, కాఫీ, సూప్ లలో దాల్చిన చెక్క పోడి కలిపితే దాని రుచే వేరు. పాలలో కలిపి తాగవచ్చు. పంచదార బదులు దాల్చిన చెక్క పొడిని వాడవచ్చు. సలాడ్లలోనూ, బ్రెడ్ లలోనూ వాడితే రుచే వేరుగా ఉంటుంది.