header

Cumin seeds, Jeelakarra, జీలకర్ర

Cumin seeds/Jeelakarra/జీలకర్ర

జీలకర్రను మనం రోజువారీగా పయోగిస్తూ ఉంటాం. జీలకర్ర రెండు రకాలు. నల్ల జీలకర్ర, తెల్ల జీలకర్ర. నల్ల జీలకర్రను షాజీర అంటారు. రెంటికీ ఔషధ గుణాలున్నాయి. వీటిని అనేక గృహ చికిత్సలకు వాడుతూ ఉంటారు . ఇది వంట ఇంట్లో వాడుకునే పోపు దినుసులలో ఒకటి . దీని శాస్త్రీయ నామము cuminuma cyminum . ఇది సుమారు 30-50 సెంటిమీటర్లు పెరిగే మొక్క. దీని గింజలు గోధుమ రంగులో ఉన్న చిన్న గింజలు . గింజలనే వంటకాల లోనూ , ఔషధము గాను వాడుతారు . ప్రాచీన కాలము నుండి ఇది వాడుకలో ఉంది .. హిందూ వివాహములో జీలకర్ర బెల్లము తలపై పెట్టుకోవడం ఒక ముఖ్యమైన ఘట్టము .
కడుపులో నులిపురుగుల నివారణకు :
జీలకర్రను తీసుకోవాలి. మజ్జిగలో ఇంగువనూ, జీలకర్రనూ, సైంధవ లవణాన్నీ కలిపి తీసుకుంటే పొట్ట ఉబ్బరింపు తగ్గుతుంది.
గుండె నొప్పులు తగ్గుటకు :
జీలకర్రను కషాయంగా కాచి తాగితే గుండెనొప్పులు రాకుండా అరికడుతుంది. బీపీ, షుగర్‌ను కంట్రోల్ చేస్తుంది. ఎలర్జీకి తగ్గుటకూ : శరీరంలో ఏర్పడే తామర, తెల్లమచ్చలు, బొల్లి వంటివి ఆరోగ్యాన్నే కాకుండా అందాన్ని కూడా దెబ్బతీస్తాయి. అందుకనే ఇటువంటి చర్మ వ్యాధులను త్వరిత గతిన గమనించి, వాటి బారి నుండి బయటపడడం చాలా అవసరం. ఇందుకుగాను సులభమైన పెరటి వైద్యం జీలకర్ర - చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఎలర్జీకి జీలకర్ర గొప్ప ఔషధం.

గర్భాశయ బాధలు తగ్గుటకు
జీలకర్రను నేతిలో వేయించి, మెత్తగా దంచి సైంధవలవణం లేదా ఉప్పును కలిపి 2 పూటలా తీసుకొంటే గర్భాశయ బాధలు నెమ్మదిస్తాయి. దీన్ని అన్నంలో కాని, మజ్జిగలో కాని తీసుకోవాలి.

మూత్ర సంబంధ వ్యాధులకు :
జీలకర్రను దోరగా వేయించి అంతకు సమానంగా వేయించని జీలకర్రను కలిపి పొడి చేసుకోవాలి. దీనికి సమానంగా పంచదార వీలైతే ఆవునెయ్యిని కలుపుకొని కుంకుడు కాయంత మాత్రలు చేసుకొని 2 పూటలా 2 చొప్పున మాత్రలు వేసుకొవాలి. దీనివల్ల మూత్ర సంబంధ వ్యాధులు, మూత్రంలో వేడి, మంట పచ్చదనం తగ్గుతాయి.

నీరసము తగ్గుటకు :
ఎప్పూడూ నీరసం, కాళ్ళ నొప్పులు, పైత్యంతో బాధపడుతున్నవారు జీలకర్రను గాని, ధనియాలు మరియు జీలకర్ర మిశ్రమం గాని తీసుకొంటే మంచిది.

పేగులు శుభ్రపరచుట :
ధనియాలు, జీలకర్ర సమానపాళ్ళలో తీసుకొని వాటిని విడివిడిగా వేయించి పొడి చేసుకోవాలి. అందులో తగినంగ సైంధవలవణం లేదా ఉప్పును కలిపి, అన్నంలో, టిఫిన్లు, మజ్జిగలో కలుపుకొని వాడుకుంటే పేగులు శుభ్రపడి రోగాలకుదూరంగా ఉంటారు.

పైత్యరోగాలకు :
జీలకర్రను నిమ్మరసముతో కలిపి సూర్యోదయ సమయాన , సూర్యాస్తమ సమయమున రెండపూటలా తింటే ... తలతిప్పు , కడుపులోని వేడిని మొదలగు పైత్యరోగములు తగ్గును .

నీళ్ళవిరోచనాలు తగ్గుటకు :

అరతులము జీలకర్ర ఇనుమూ గరిటె లో మాడబెట్టి అందులులో 5-6 తులముల నీరు పోసి ... చల్లారిన తరువాత ప్రతి 4 గంటలకొకసారి తీసుకుంటే నీళ్ళవిరోచాను తగ్గుతాయి

వాంతులు తగ్గుటకు : వేయించం జీలకర్ర తో సమముగా సైంధవలవణము కలిపి నూరి .. సీసాలో బద్రపరిచి రోజుకు కొంచము కొంచము గా రెండుపూటలా ఇచ్చిన వాంతులు తగ్గును