header

Curry Leaves

కరివేపాకు

దక్షిణ భారతదేశ వంటకాలలో కరివేపాకు వాడకం తప్పనిసరి. కరివేపాకులో పీచు, ప్రొటీన్లు, కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. కరివేపాకు జీర్ణక్రియకు సహకరిస్తుంది. శరీరంలోని కొవ్వును కరిగిస్తుంది. చెడు కొలస్ట్రాల్ ను తగ్గిస్తుంది. జుట్టు నల్లపడటన్ని పెంచుతుంది. గుప్పెడు కరివేపాకును ప్రసవం తరువాత తింటే పాలు పడతాయి. కరివేపాకులో ’‘ విటమిన్ యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండటం వలన చిన్నవయసులోనే కేటరాక్ట్ రాకుండా ఆపుతుంది.
మంచి కరివేపాకును ఎలా తెలుసుకోవాలి?
ఆకులు తాజాగా, మచ్చలు, చుక్కలు లేకుండా ముదురాకు పచ్చరంగులో ఉండాలి. విడిగా కాకుండా కొమ్మలను కొనటం మంచిది. తాలింపులకు, పప్పు, రసం, సాంబారులలో కరివేపాకు తప్పనిసరి. కరివేపాకు జ్యూస్ :
పావు కప్పు కరివేపాకు, అరటీ స్పూన్ మెంతులు, అర టీ స్పూన్ జీలకర్ర, ఒక టీస్పూన్ శొంఠి పొడిని సన్నని సెగపై వేయించాలి. నీరు కలిపి కొద్దిసేపు మరిగించి, వడకట్టి, నిమ్మరసం, పంచదార వేసి బాగా కలిపి తాగాలి. జీర్ణక్రియకు బాగా సహకరిస్తుంది.
కరివేపాకుతో చట్నీ:
ఒక కప్పు తాజా కరివేపాకు, పావు కప్పు కొత్తిమీర ఆకులు, పావు కప్పు కొబ్బరి తురుము, అరంగుళం అల్లం ముక్క, మూడు నాలుగు వెల్లుల్లి రెబ్బలు, మూడు, నాలుగు పచ్చి మిర్చి లేక ఎండు మిర్చి, అరటీస్పూన్ బెల్లం, ఒక టీస్పూన్ చింతపండు గుజ్జు, ఒక టీ స్పూన్ నువ్వులు, కొద్దిగా జీలకర్ర, తగినంత ఉప్పు. వీటన్నింటిని కలిపి కొద్దిగా వేయించి మొత్తగా రుబ్బుకోవాలి. ఇడ్లీ, దోసె లేక అన్నంలోకి మంచి కాంబినేషన్. కరివేపాకు ఎక్కువ రోజులు నిలవ ఉండదు. కాడలతో సహా కాగితంలో చుట్టు ఫ్రిజ్ లో పెట్టుకోవచ్చు.