దాదాపు నల్లగా ముదురు రంగులోని ఆవాలను మన దేశంలో ఎక్కువగా వాడతారు. పసుపు, తెలుపు రంగుల్లో కూడా ఇవి లభిస్తాయి. మన దేశంలో పోపు దినుసుగా ఆవాలను విరివిగా ఉపయోగిస్తారు. ఆవకాయ తయారీలోనూ వాడతారు. పాశ్చాత్య దేశాల్లో ఆవాల ముద్దను వంటకాల్లో ఉపయోగిస్తారు. పశ్చిమబెంగాల్ ప్రాంతంలో ఆవ ఆకులను ఆకుకూరగా ఉపయోగిస్తారు.
ఆవాల్లో ప్రొటీన్లు, విటమిన్లు, ఖనిజ లవణాలు, కొవ్వులు పుష్కలంగా ఉంటాయి. ఇందులో కొవ్వులు ఎక్కువగా ఉండటంతో ఆవాల నుంచి ఆవనూనెను తీసి వంటకాల్లో ఉపయోగిస్తారు.
తరచుగా అయ్యే గర్భస్రావాలను అరికట్టడంలో ఆవాలు బాగా ఉపయోగపడతాయి. గర్భిణిలు వీటిని తీసుకోవడం వల్ల.. కడుపులోని శిశువుకి హానిచేసే సూక్ష్మక్రిములు నాశనం అవుతాయి. చర్మవ్యాధులతో బాధపడేవారు ఆవ నూనె రాసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది