header

Onions / ఉల్లిపాయ

Onions / ఉల్లిపాయ

ఉల్లిపాయలో హానికర ఫ్రీ రాడికల్స్‌ను నాశనం చేయగల యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. అందుకే ఉల్లిని వేల సంవత్సరాల నుంచీ ఆయుర్వేద వైద్యులతోబాటు ఆధునిక నిపుణులు సైతం అద్భుతమైన ఔషధంగా పేర్కొంటున్నారు.
రక్తం గడ్డకట్టకుండా పలుచగా ఉండేలా చేసే ఉల్లిపాయ ఆకలినీ తగ్గిస్తుంది. హృద్రోగులకీ వూబకాయులకీ ఉల్లి ఎంతో మేలు చేస్తుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం చెబుతోంది.
ఇందులోని యాంటీ బ్యాక్టీరియల్‌ గుణాల వల్ల దీర్ఘకాలిక ఆస్తమా, అలర్జిక్‌ బ్రాంకైటిస్‌, జలుబు, దగ్గు... వంటి వ్యాధులన్నీ తగ్గుతాయి.
పచ్చి ఉల్లిపాయ ముక్కని తీసుకుని రెండుమూడు నిమిషాలు నమిలితే చిగుళ్ల వ్యాధులు తగ్గుతాయి. ఇది నోట్లో ఉండే హానికర బ్యాక్టీరియానీ నాశనం చేస్తుంది.
సాధారణంగా ఏ ఇతర ఆహారంలోనూ దొరకని క్రోమియం అనే ఖనిజం ఉల్లిపాయల్లో పుష్కలం. ఇది రక్తంలో చక్కెర శాతాన్ని నియంత్రించేందుకు తోడ్పడుతుంది. అందుకే మధుమేహులు రోజూ చిన్న పచ్చి ఉల్లిపాయని తినడం వల్ల ఫలితం ఉంటుంది.
ఉల్లిపాయల్లో క్యాన్సర్‌ కణాలను అడ్డుకునే క్యుయెర్సిటిన్‌ శాతం చాలా ఎక్కువ.
చెవినొప్పి తీవ్రంగా వస్తుంటే దూది ద్వారా రెండుమూడు చుక్కల ఉల్లి రసం వేస్తే వెంటనే ఫలితం ఉంటుంది. కాస్త తేనె, ఆలివ్‌నూనె, ఉల్లిరసం కలిపి రాస్తే మొటిమలు తగ్గుతాయి.
దగ్గు, గొంతునొప్పిలతో బాధపడేవాళ్లు ఉల్లిరసం, తేనె సమపాళ్లలో కలిపి రోజుకి రెండు టేబుల్‌స్పూన్ల చొప్పున తీసుకుంటే త్వరగా తగ్గుతుంది.
రక్తహీనతతో బాధపడేవాళ్లకీ ఉల్లిపాయ మంచిదే. ఉల్లితురుములో బెల్లం తురుము కలిపి నీళ్లు చిలకరించి రోజూ తింటుంటే శరీరంలో ఐరన్‌ శాతం పెరుగుతుంది.
ఉల్లిపాయను మరిగించిన నీళ్లు మూత్ర సమస్యలకి మంచి ఔషధంలా పనిచేస్తాయి.