header

Pepper మిరియాలు

మిరియాలు

మిరియాలు రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం మిరియాలను గాలి చోరని డబ్బాలలో నిల్వ ఉంచాలి. లేకపోతే వాటిలోని రుచి, వాసన గాలికి ఆవిరైపోతాయి. అందుకని మనకు అవసరమైనపుడే మిరియాలను కొనుక్కోవాలి. ముందుగానే కొని నిల్వ ఉంచరాదు. వేడి వలన కూడా వీటి రుచి, వాసనలలో తేడా వస్తుంది. వంట పూర్తి అయ్యే ముందు మాత్రమే వీటిని వంటలలో కలపాలి. తాజాగా పొడి చేసిన మిరియాలను పప్పులలోను గ్రేవీలలోను వేస్తే వంటకాలు మరింతచ రుచికరంగా ఉండటమే కాదు, జీర్ణక్రియ కూడా మెరుగుపడుతుంది.
నల్ల మిరియాలలో ఉండే పిపరైన్, హైడ్రోక్లోరిక్ ఆమ్లం పొట్టలో బాగా ఊరేటట్లు సహాయం చేస్తుంది. అరుగుదలకు ఈ ఆమ్లం తప్పనిసరి రోజూ ఆహారంలో మిరియాల పొడి వాడుతూ ఉంటే గ్యాస్ సమస్యలు, అజీర్ణం, అతిసారం, మలబద్దకం, కడుపులో మంట లాంటి ఇబ్బందులు చాలా వరకు తగ్గుతాయి.
జలుబు దగ్గుకు మిరియాలు బాగా జలుబు, దగ్గుతో బాధపడుతూ వుంటే తాగే సూపులో, పాలలో, కొద్దిగా మిరియాల పొడి వేసి తాగితే ముక్కు దిబ్బడ, గొంతు నొప్పి, సైనసైటిస్ మరియు దగ్గు తగ్గుతాయి.
మిరియాలు ముక్కులో అడ్డుపడే మ్యూకస్ ను బయటకు పంపిస్తాయి. నల్ల మిరిమయాలు చర్మంపైన ఉండే మృతకణాలను తొలగిస్తాయి. చర్మ సంబబంధమైన ఇన్ఫెక్షన్లు రాకుండా చేస్తాయి.
దుస్తులు వెలవకుండా : ుస్తులు వెలసిపోవడం మొదలైతే వాటిని ఉతికేటపుడు ఒక టీ చెంచా మిరియాల పొడిని వాషింగ్ మెషిన్లో కానీ, బకెట్లో కానీ వేస్తే దుస్తులు వెలసిపోవటం ఆగిపోతుంది.
శరీరంలోని వ్యర్ధాలను తొలగిస్తుంది. మిరియాలను, మిరియాల నూనెను మనం తినే ఆహారంలో వాడటం వలన శరీరంలో ఆహారం ద్వారా, ఇతర మార్గాల ద్వారా చేరిన హాని చేసే రసాయనాలు బయటకు పంపబడతాయి. శరీరంలో లోపలి భాగాలు శుద్ది అవుతాయి.
నల్ల మిరియాలను కానీ కషాయాన్న గానీ వాడటం వలన చెవిపోటు, కంటి సమస్యలు, హెర్నియా, కీటకాలు కుట్టడం వలన వచ్చిన ఇబ్బందుల నుండి బయటపడవచ్చు.