భారతీయ సంస్కృతిలో పసుపుకి విశిష్టమైన స్థానం ఉంది. పసుపును శుభప్రదంగా పరిగణిస్తారు. పూజ పునస్కారాల్లోనే కాదు, వంటకాల్లో కూడా పసుపును విరివిగా ఉపయోగిస్తారు. ఆయుర్వేద, సిద్ధ, యునానీ, చైనీస్ సంప్రదాయ ఔషధాల్లోనూ పసుపును వాడతారు.
పసుపులో పిండి పదార్థాలు, పీచు పదార్థాలు, విటమిన్లు, ఖనిజ లవణాలు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.
పసుపును రోజువారీ ఆహారంలో తీసుకోవడం వల్ల జీర్ణకోశ సమస్యలు దూరమవుతాయి.
జలుబు, దగ్గు వంటి సాధారణ సమస్యలకు, చర్మ వ్యాధులకు పసుపు మంచి విరుగుడుగా పనిచేస్తుంది. పసుపులో క్యాన్సర్ నిరోధక లక్షణాలు ఉన్నట్లు ఇటీవలి పరిశోధనలు చెబుతున్నాయి. చిన్న పిల్లలకు గానీ, పెద్దవారికి గానీ కింద పడ్డప్పుడు తగలే చిన్న చిన్న గాయాలకు, గీరుకుపోవటం జరిగితే పసుపు పెట్టటం అనవాయితీ.