వేల సంవత్సరాలుగా భారతదేశంలో అనేక వ్యాధులను నయం చేయటానికి అల్లంను వాడుచున్నారు. అల్లం సహజసిద్ధమైన ఔషధం.
అల్లంలోని ఎలర్జీలను తగ్గించే గుణం వలన ఉబ్బసం, రొమ్ముపడిశం తగ్గుతాయి.
అన్నం తినే ముందు ఒక చిన్న అల్లంముక్కను తింటే ఆకలి పెరుగుతుంది.
ప్రయాణాల్లో కలిగే వికారం, శస్త్రచికిత్స తరువాత వచ్చే వికారం, కీమో ధెరపీ వల్ల వచ్చే వికారం అల్లం రసం తాగటం వలన తగ్గుతుంది.
కడుపుబ్బరం, వాయుప్రకోపం తగ్గటానికి : కడుపులోని గ్యాస్ ను బయటకు పంపటంలో అల్లం ఎంతగానో ఉపయోగపడుతుంది. కడుపులోని గ్యాస్ ఇబ్బంది పెడుతుంటే, కడుపు ఉబ్బరంగా ఉంటే ఒక చిన్న అల్లం ముక్కను బాగా దంచి రసంతీసి తేటను తాగితే కడుపుబ్బరం తగ్గుతుంది.
ఎక్కువగా కడుపు ఉబ్బరంగా ఉంటే వామును కూడా దంచి అల్లం రసంలో కలుపుకుని తాగితే ఫలితం ఉంటుంది. అల్లం రసాన్ని రోజు మొత్తం మీద రెండు చెంచాలు మించకుండా తాగాలి.