కావలిసినవి
తాజా పెరుగు : 2 కప్పులు
అరటిపండ్లు : రెండు కాయలు
చల్లటినీరు : మూడు గ్లాసులు
ఉప్పు : చిటికెడు
తయారు చేసే విధానం:
అరటిపండ్లను చిన్న, చిన్న ముక్కలుగా చేసుకొని, వీటితో పాటు పెరుగును కూడా మిక్సీలో వేసుకొని గిలకొట్టుకోవాలి. దీనిలో చల్లటి నీరు కలుపుకుని కొద్దిగా ఐస్ కూడా వేసుకోని చల్లచల్లగా సేవించవచ్చు.
కావలిసినవి
పెరుగు : 1 కప్పు
చల్లటి నీరు : 2 గ్లాసులు
ఉప్పు : చిటికెడు
బీట్ రూట్ : 1 కప్పు ముక్కలు
కొత్తిమీర తురుము : కొద్దిగా
పుదీనా ఆకులు : కొద్దిగా
తయారు చేసే విధానం :
బీట్ రూట్ ముక్కలు, పుదీనా, కొత్తిమీరను మిక్సీలో వేసి మెత్తగా చేసుకొవాలి. ఇందులో కొద్దిగానీరు పోసుకొని మడకట్టుకోవాలి. తరువాత పెరుగు కూడా మిక్సీలో వేసి గిలకొట్టుకొని అందులో వడకట్టకున్న జ్యూస్ ను కూడా వేసి గిలకొట్టుకొని తరువాత నీటిని కూడా కలిపి ఇష్టమున్న వారు కొద్దిగా ఐస్ కలుపుకొని చల్లగా సేవించుకోవచ్చు.
కావలిసినవి
కీరాముక్కలు : కొద్దిగా
పెరుగు : 1 కప్పు
చల్లటి నీరు : 2 గ్లాసులు
జీలకర్ర : 1 స్పూను
అల్లం : కొద్దిగా
పుదీనా : కొద్దిగా
కొత్తిమీర తురుము : కొద్దిగా
తయారు చేసే విధానం
కీరా ముక్కలు, సన్నగా తరిగిన అల్లం ముక్కలు, పుదీనా,జీలకర్ర కొతిమీర అన్నీటినీ మిక్సీలో వేసి మొత్తగా చేసుకొని కొద్దిగా నీరు పోసుకొని వడకట్టుకోవాలి. తరువాత పెరుగు కూడా మిక్సీలో వేసి గిలకొట్టుకోవాలి. ఈరెండింటిలో చల్లటి నీరు కలుపుకుంటే చల్ల చల్లనీ కీరా లస్సీ రెడీ.