header

Ahobilam Narasimha Swamy

ఈ క్షేత్రంలో స్వయంభువుగా వెలసిన దేవదేవుడు ఊగ్రనరసింహస్వామి. హిరణ్యకశిపుని వధించటం కోసం హరి నరహరిగా ఆవిర్భవించిన ప్రదేశంగా చెబుతారు. అహోబిలం యాత్రాస్థలమే కాకుండా మంచి పర్యాటక కేంద్రంగా కొండల నదులు, ప్రకృతి అందాలకు నెలవు. భవనాశని నది మరియు జలపాతం ఇక్కడ కలవు.
ఈ భూమి మీద ఉన్న నాలుగు దివ్వమైన నారసింహ క్షేత్రాలో అహోబిలం ఒకటి. రాక్షస రాజైన హిరణ్యకశిపుని సంహరించటానికి తన శిష్యుడైన ప్రహ్లాదుని రక్షించటానికి స్తంభమునుండి ఉద్భవించిన స్ధలమే అహోబిల క్షేత్రము. వ్యాసమహర్షి ఈ స్థలపురాణం గురించి బ్రహ్మాండపురాణం అంతర్గతంలోనూ 10 అధ్యాయాలు 1046 శ్లోకాలతో సంస్కృతంలో వ్రాయబడినది.
ఎగువ అహోబిలం మరియు దిగువ అహోబిలం చుట్టు ప్రక్కల నవనారసింహలను దర్శించవచ్చు. ఇంకా ఇక్కడ చూడదగ్గవి ప్రహ్లాదబడి అనే చిన్న గుహ. కొండమీద నుండి పడే నీటితో వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఈ గుహ ఎదురుగా విశాలమైన రాళ్ళ చప్టాతో సహజసిద్ధంగా ఉంటుంది. అహోబిల మఠం మరియు ఊగ్రస్ఠంభంను చూడవచ్చు. ఈ స్థంభంనుండే నారసింహుడు ఉద్భవించాడని అంటారు.
ఎలా వెళ్లాలి ? ఈ క్షేత్రం నల్లమల అడవులలో, కర్నూలు జిల్లాలోని నంద్యాల రైల్వే స్టేషన్‌కు 68 కి.మీ. దూరంలోనూ ఆళ్ళగడ్డకు 24 కి.మీ. దూరంలోను కలదు.