header

Sri Lakshmi Narasimha Swamy, Antarvedi

తూర్పుగోదావరి జిల్లా, సఖినేటిపల్లి మండలంలో, వశిష్ఠగోదావరి మరియు సముద్రతీరానికి దగ్గరలో ఉన్నది ఈ ఆలయం. ఒకప్పుడు బ్రహ్మదేవుడు శివుడి పట్ల చేసిన అపరాధానికి ప్రాయశ్ఛిత్తంగా రుద్రయాగం చేయాలని తలపెడతాడు. యాగానికి ఈ ప్రదేశాన్ని ఎన్నుకుంటాడు. అందువలనే ఈ ప్రదేశానికి అంతర్‌ వేదిక, అంతర్వేదిగా పేరువచ్చింది.
ఈ ఆలయం చక్కని నిర్మాణ శైలిలో రెండు అంతస్తులుగా కట్టబడినది. ప్రాకారము కూడా రెండు అంతస్తులుగా నిర్మించబడి యాత్రికులు పై అంతస్తుకు వెళ్ళి ప్రకృతి అందాలు తికించుటకు వీలుగా నిర్మించారు.
ఆలయానికి దూరముగా వశిష్టా నదికి దగ్గరగా విశామైన స్థలమునందు కళ్యాణమండపం నిర్మించారు. ఈ ఆలయం క్రీ॥శ 300 కు పూర్వమే నిర్మించబడినదని చెబుతారు.
పూర్వాలయం శిధిలం కాగా ప్రస్తుత ఆలయం పెద్దాపురం జమిందారు కుటుంబీకుడైన శ్రీ కొపనాతి కృష్ణమ్మగారి విరాళాలు, కృషి ద్వారా జరిగింది.
ఉత్సవాలు : భీష్మ ఏకాదశికి ఉత్సవాలు జరుగును. (సాధారణంగా జనవరి-ఫిబ్రవరిలో భీష్మఏకాదశి వస్తుంది) దశమి రోజున స్వామివారి కళ్యాణం మరియు ఏకాదశి రోజున స్వామివారి రథయాత్ర జరుగుతుంది. ఈ కళ్యాణోత్సవాలు దశమిరోజు ప్రారంభమై పౌర్ణమి రోజు దాకా జరుగుతాయి.
వశిష్టాశ్రమం : అంతర్వేది దేవాలయానికి కొంచెం దూరంగా సముద్రానికి దగ్గరగా ఈ ఆశ్రమం నిర్మించబడినది.ఈ ఆశ్రమాన్ని వికసించిన కమలం మాదిరిగా 4 అంతస్తులలో నిర్మించారు. చుట్టూ సరోవరం మధ్యలో ఆశ్రమం అద్భుతంగా ఉంటుంది. దీనికి దగ్గరగా ధ్యానమందిరం, పఠనాశాల, యాగశాల, విశ్రాంతి మందిరం మొదలగునవి కలవు. యాత్రికుల విశ్రాంతి కోసం పర్ణశాలవంటి అందమైన కట్టడాలు కలవు.
దీపస్తంభము : దేవాలయానికి దక్షిణంగా సముద్రతీరంలో ఉన్నది. ఇది బ్రిటీష్‌ వారిచే కట్టబడినదిని చెబుతారు. ఇక్కడకు యాత్రికులే కాక పిక్నిక్‌కు వనభోజనాలకు వచ్చేవారితో కళకళలాడుతుంది.
ఇంకా ఇక్కడ అశ్వరూఢాంబిక (గుర్రాలక్క) ఆలయం,అన్నా చెల్లెళ్ళ గట్టు ఉన్నాయి. సముద్రతీరంలో విహరించవచ్చు.