Sri Lakshmi Narasima Swami Temple, Korukonda / శ్రీ లక్ష్మీ నరసింహస్వామి, కోరుకొండ :
ఈ సుప్రసిద్ధ లక్ష్మీనరసింహ దేవాలయం తూర్పుగోదావరి జిల్లాలో రాజమండ్రికి 20 కి.మీ. దూరంలో మరియు కాకినాడకు 60 కి.మీ. దూరంలో కలదు.
ఈ దేవాలయం అన్నవరం దేవస్థానం వారిచే దత్తత తీసుకొనబడినది.
ఈ వైష్ణవాలయం చారిత్రక మరియు పురాతనమైనది. ఇక్కడ పూజలన్నీ ఆగమశాస్త్ర ప్రకారం జరుగుతాయి. ఇక్కడ రెండు దేవాయాలు కలవు. ఒకటి స్వయంభువు మరొకటి ప్రతిష్టించబడినది. స్వయంభువు దేవాలయం కొండమీద 120 మీటర్ల ఎత్తులో కట్టబడినది. 615 మెట్ల ఎక్కవలసి ఉంటుంది. ఈ దేవాలయం షుమారు 700-800 సంవత్సరాల క్రితం కట్టబడినదంటారు. ప్రసిద్ధ కవి శ్రీనాధుడు కూడా ఈ స్వామిగురించి తన రచనలో ప్రస్తావించాడు.
ఇక్కడ జరుగు ఉత్సవాలు :
స్వామివారి కళ్యాణ మహోత్సవాలు: 5 రోజులు జరుగుతాయి. ఫాల్గుణ మాసం, శుద్ధ ఏకాదశి (మార్చి) ఉగాది నుండి చైత్రశుద్ధ పాడ్యమి (మార్చి-ఏప్రియల్)
శ్రీరామానుజు వారి తిరునక్షత్రం - మే నెలలో గోదావరి పుష్కర మహాత్మ్యం - పుష్కరాల సమయంలో (జులై - ఆగష్టు 12 సం॥కు ఒకసారి)
నవరాత్రి ఉత్సవం : ఆశ్వియుజ శుద్ధ పాడ్యమి (అక్టోబర్)
ధనుర్మాస ఆచారలు : (మార్గశిర మాసం - డిసెంబర్)
ముక్కోటి మహోత్సవం : జనవరి శుద్ధ ఏకాదశి