header

Sri Lakshmi Narasimha Swamy, Simhachalam / శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి, సింహాచలం

సింహాచల పుణ్యక్షేత్రం విశాఖపట్టణానికి సుమారు 12 కి.దూరంలో కలదు. ఆర్‌ టి సి బస్‌స్టాండ్‌ నుండి బస్సులలో గాని ఆటోలు/టాక్సీలలో గాని వెళ్ళవచ్చు. కొండపైకి మెట్ల మార్గం నుండి గాని (సుమారు 1000 మెట్లు) లేక ఘాట్‌ రోడ్డు మీదుగా దేవసాన్థం వారి బస్సులలో గాని టాక్సీలలో గాని వెళ్ళవచ్చు.
ఉత్సవాలు :
కళ్యాణోత్సవం : శ్రీస్వామివారి వార్షిక కళ్యాణ మహోత్సవం (చైత్రశుద్ధ దశమి నుండి చైత్ర పౌర్ణమి వరకు)
నృసింహ జయంతి : శ్రీస్వామి వారి జయంతోత్సవం (వృషభ శుక్ల చతుర్ధశి)
వైశాఖమాసం 14వ రోజునుండి చందనోత్సవం
నిజరూప దర్శనం : శ్రీ స్వామివారి నిజరూప దర్శనం సంవత్సరంలో ఒక్కరోజు మాత్రమే. ఈ రోజు స్వామివారి మీద చందనం తొలగిస్తారు. ఉదయం నుండి రాత్రి తొమ్మిది గంటల వరకు భక్తులకు దర్శనం. (వైశాఖ శుద్ధ తదియ/అక్షయ తృతీయ)
గిరి ప్రదక్షణ : ఆషాఢ మాసం పౌర్ణమి రోజున (జూన్‌/జులై) భక్తులు సింహాచలం కొండ చుట్టూ భక్తిశ్రద్ధలతో ఉపవాసం ఉండి, ప్రదక్షణ చేస్తారు. ప్రదక్షణ అనంతరం శ్రీస్వామి వారిని దర్శించుకున్న తరువాతనే రాత్రి భోజనం చేస్తారు. కొండ చుట్టూ దూరం 34 కి.మీ. కొండ చుట్టూ ప్రదక్షణ చేయలేని వారు దేవాలయం చుట్టూ 108 సార్లు ప్రదక్షణ చేసి సంతృప్తి చెందుతారు.