ఖమ్మం జిల్లాలోని ఖమ్మం పట్టణానికి నడిబొడ్డున 150 అడుగుల ఎత్తున కొండపైన ఈ ఆలయం కలదు. విజయవాడ - హైదరాబాద్ రైలు మార్గంలో ఖమ్మం పట్టణం కలదు.
స్థల పురాణం : సనాతన ధర్మానికి ఆయువు పట్టులాంటి వారు రుషులు. పూర్వం మౌద్గల్యుడనే మహర్షికి ఇక్కడి ప్రశాంత వాతావరణం నచ్చడంతో ఓ గుహలో శ్రీహరి కోసం తపస్సుచేశాడు. ఆ తపస్సుకు మొచ్చిన శ్రీహరి లక్ష్మీసమేతుడిగా నారసింహుడిగా ప్రత్యక్షమయ్యాడు. అప్పుడు ఆ మహర్షి తనకోసం ఏమీ కోరుకోకుండా భక్తులు కోరికలు నెరవేర్చేందుకు ఇక్కడే కొలువు తీరవలసిందిగా కోరాడట. ఆయన నిస్వార్థ భక్తికి మొచ్చిన శ్రీహరి గుహలో లక్ష్మీనరసింహుడిగా స్వయంభువై వెలశాడని స్థలపురాణం.
పదహారో శతాబ్థంలో కాకతీయ చక్రవర్తి ప్రతాపరుద్రుడు ఈ స్తంభాద్రిని దర్శించుకుని మండపాన్ని నిర్మింపజేసాడు. కొండను తొలిచి చేసిన స్తంభాలపై కాకతీయు నిర్మాణశైలి వారి కళాతృష్ణను ప్రతిబింబిస్తుంది. ఈ ఆలయంలోని ఒక విశేషం రాతితో నిర్మించిన ఏకశిలా ధ్యజస్తంభం.
ఇక్కడ స్వామి దక్షిణాభిముఖుడై ఉంటాడు గర్భగుడిలో స్మామికి ఎడమవైపున లక్ష్మీదేవి కుడివైపు అద్దాల మండపం ఉంటాయి. స్వామికి ఎదురుగా కొలువైన ఆంజనేయస్వామి, విష్ణుమూర్తి ఆలయాలు ఉన్నాయి.
ప్రధాన ఆలయానికి వెనుక భాగంలో ఒక కోనేరు ఉంది. ఈ కోనేటిలో అన్ని కాలాల్లోనూ నీరు ఉంటుంది. వర్షాకాలంలో నీరు ఎక్కువగా వచ్చినపుడు ఈ కోనేరును అనుకుని ఉన్న ఆలయంలోని స్వామివారి నాభి సూత్రం నుంచి గర్భాయంలోని స్వామివారి దగ్గరకు నీరు చేరుతుంది. దానివల్ల భక్తుకూ పూజకూ ఆటంకం కగకుండా ఆ నీటిని బయటకు పంపేందుకు పైపులైను ఏర్పాటు చేశారు. నరసింహస్వామి పానకప్రియుడంటారు.
పానకంతోనే ఆయన శాంతిస్తాడు.ఈ చుట్టుప్రక్క ప్రాంతంలోని ముస్లింలు తమ పెద్దల స్మారకార్థం ఏటా ఉగాది నాడు ఆలయానికి వచ్చి, మొక్కులు చెల్లించి స్వామికి విరాళాలు, బట్టలు కూడా సమర్పిస్తుంటారు. కొన్ని వందల ఏళ్లనుంచి ముస్లిలుము ఈ ఆలయానికి వచ్చి మొక్కులు చెల్లించుకోవటం పరిపాటిగా మారింది.